182వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Day 182 of Praja Sankalpa Yatra Begins | Sakshi
Sakshi News home page

182వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Jun 6 2018 9:37 AM | Updated on Mar 21 2024 7:48 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బయలుదేరారు. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement