దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తిని కారు ఢీకొని, చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్‌పై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో అత్యంత అమానవీయమైన విషయం ఏమిటంటే ప్రమాదం జరిగిన తరువాత ఆ వ్యక్తి మృతదేహంపైనుంచి అనేక వాహనాలు వెళ్లిపోయాయి. కనీసం ఎవరూ కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.
ఈ ప్రమాదానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో ‘గత రాత్రి 11:20 గంటలకు, జాతీయరహదారి- 8 సర్వీస్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం ఉన్నట్లు ఉత్తర వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చిందని తెలిపారు. పరిశీలనలో ఆ గుర్తుతెలియని మృతదేహం ఫరీదాబాద్‌కు చెందిన 43 ఏళ్ల బిజేందర్‌గా గుర్తించామని పేర్కొన్నారు. బిజేందర్ టాక్సీ డ్రైవర్. ఈ ఘటనకు కారకులైన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ప్రమాదానికి గురైన టాక్సీ.. మృతుడు బిజేందర్‌దేని పోలీసులు గుర్తించారు. బిజేందర్ ఈ టాక్సీని నడిపేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వేరొకరి నుంచి ఈ టాక్సీ కొనుగోలు చేశాడు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం..
Comments
Please login to add a commentAdd a comment