బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. బెంగళూరుకు చెందిన కొందరు భక్తులు కారులో తిరుపతికి వెళ్తుండగా గంగవరం సమీపంలో ఎదురుగా వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సులోని 12 మంది ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
బస్సు, కారు ఢీ: ఇద్దరి దుర్మరణం
Published Tue, Sep 22 2015 10:50 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement