
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
భోగాపురం : సమయం మధ్యాహ్నం 2 గంటలు.. తమిళనా డుకు చెందిన లారీ స్థానిక హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారి పక్కన ఆగింది. డ్రైవరు, క్లీనరు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బంక్‌లో ఉన్న మరు గుదొడ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న నీళ్ల ట్యాంకు వద్ద కాళ్లు, చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న వారి లారీని వెను క నుంచి వచ్చిన టాటా మేక్స్ వాహనం బలంగా ఢీకొంది. వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ముందు సీట్లో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు ఇరు క్కుపోయారు. స్థానికులు అప్రమత్తమై సహాయక చర్య లు చేపట్టారు. ముందుగా డ్రైవరును బయటకు తీశా రు. డ్రైవర్ పక్కసీట్లోనే ఇద్దరు కూర్చొన్నారు. వీరిలో మహిళ కూడా ఉన్నారు. వారినీ బయటకు లాగేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు. అయితే, కొద్దిసేప ట్లోనే ఇద్దరూ తనువు చాలించారు. వాహనం వెనుక కూర్చున్న ఎనిమిది మందికి తీవ్ర గాయూలయ్యూయి. బాధతో వారు చేస్తున్న ఆర్తనాదాలు చూపురులకు కన్నీళ్లు తెప్పించాయి.
బతుకుతెరువు కోసం...
విశాఖపట్నంలోని కంచరపాలేనికి చెందిన ఆడారి మల్లీశ్వరి (38) వికలాంగురాలు. బతుకుతెరువు కోసం 2012లో టాటామేక్స్ వాహనాన్ని ప్రభుత్వ పథకాల ద్వారా రుణం పొంది కొనుగోలు చేసింది. వాహనాన్ని నడిపేందుకు డ్రైవరును పెట్టుకుంది. తాను కూడా ఆ వాహనంలోనే ఉంటూ ప్రయాణికుల వద్ద నుంచి డబ్బులను వసూలు చేస్తుంటుంది. వ్యానును రోజూ విశాఖపట్నం కాంప్లెక్సు వద్ద నుంచి శ్రీకా కుళం వరకు జాతీయ రహదారిపై నడుపుతుంటారు. శనివారం సింహాచలం గ్రామానికి చెందిన మజ్జి రవి వాహనాన్ని నడుపుతున్నాడు.
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విశాఖ నుంచి శ్రీకాకుళం ఈ వాహనం
బయల్దేరింది. ఆ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పల్లపూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది విశాఖలో ఎక్కారు. వారంతా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామంలో బంధువుల ఇంట కార్యానికి వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలానికి చెందిన పందిరిపిల్లి మన్మథరావు (45) కూడా తన గ్రామానికి వెళ్లేందుకు ఇదే వాహనం ఎక్కాడు. డ్రైవర్ పక్కన పందిరిపిల్లి మన్మథరావు, వాహన యజ మాని మల్లీశ్వరి కూర్చుని ఉన్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో భోగాపు రం సమీపాన డ్రైవరు నిద్ర మత్తులోకి జారుకున్నాడు.
రెప్పపాటులో ఎదురుగా రోడ్డుకు పూర్తిగా పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొ న్నాడు. వాహన ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్‌కు కుడికాలు విరిగి పోయింది. అతని పక్కన ఉన్న మన్మథరావు, మల్లీశ్వరి తీవ్ర గాయూలపాలై వాహనంలోనే ప్రాణాలు విడిచా రు. వారి కాళ్లు, చేతులు నుజ్జునుజ్జయిపోయూయి. గాయపడిన వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గుడిసె రాజారావు, హరికృష్ణ, సూర్యావతి, రమణ మ్మ, సువ్వారి లింగరాజు, వెల్లంకి సత్యవతి, పైల నారాయణ, చంటిబాబు తదితరులున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై లోవరాజు, దీనబంధు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108 వాహనాల ద్వారా విశాఖ కేజీహెచ్‌కు, జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.