
రాంచీ : ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (71) అనారోగ్యం బారినపడ్డారు. ఆయన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని రాజేందర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు తెలిపారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్ చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి సీనియర్ డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ శనివారం వెల్లడించారు. షుగర్, బీపీ స్థాయుల్లో కూడా నిలకడ లోపించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment