జీతం ఇవ్వలేదని అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న పోచ్చన్న (35) వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
జీతం ఇవ్వలేదని అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న పోచ్చన్న (35) వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఐదేళ్లుగా రిమ్స్ లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.