ఆచూకేది..?
ఆచూకేది..?
Published Sat, Aug 20 2016 12:29 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
ముందుకు సాగని మెడికోపై అత్యాచారం కేసు
బెయిల్ ప్రయత్నంలో వైద్యుడు
రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు..!
డెరైక్టర్, డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని కొనసాగుతున్న ఆందోళనలు
ఆదిలాబాద్ క్రైం : తనపై అత్యాచారం చేశాడంటూ రిమ్స్ వైద్య విద్యార్థిని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పది రోజలు గడుస్తున్నా కేసు ఇంకా ముందుకు సాగడం లేదు. సంబంధిత వైద్యుడు పరారీలో ఉండడం తో ఆచూకీ కోసం పోలీసులు గాలి స్తూనే ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసు లు వైద్యుడి అరెస్టులో జాప్యం జరుగుతుండడంతో కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డాక్టర్ సందీప్ పవార్ తరఫు న్యాయవాది కేసుకు సంబంధించిన పత్రాలు తీసుసుకున్నారు.
పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న వైద్యుడు బెయిల్ వచ్చే వరకు అజ్ఞాతంలో ఉండేలా ప్రయత్నాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందం వైద్యుడి కోసం గాలిస్తోంది. ఈ క్ర మంలో మొదటి రోజు వైద్యుడి ఫోన్ సిగ్నల్ దొరికినప్పటికీ ఆ తర్వాత నుంచి పత్తా లేకుండా పోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సదరు పోలీసు బృందం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఎలాంటి కేసైనా సాంకేతికంగా త్వరగా గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసులు ఈ కేసులో మాత్రం వెనుకబడిపోయారని తెలుస్తోంది.
రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు..
ఇదిలా ఉంటే.. వైద్యుడిపై కేసును వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థినిపై రిమ్స్ అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. విద్యార్థినితో రాజీ కుదిర్చేందుకు వైద్యుడి సంబంధీకులతోపాటు, కొంత మం ది నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైంత త్వరగా కేసును పక్కదారి పట్టించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. డాక్టర్‌కు రిమ్స్ అధికారులు కూడా మద్దతు తెలుపడంతో విద్యార్థిని వైపు నుంచి రిమ్స్‌లో ఎవరూ సహాయం చేయకుండా చూస్తున్నారు. తల్లిదండ్రులను వదిలేసి ఎంతో దూరం నుంచి వచ్చి రిమ్స్‌పై నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ వదిలేసి పోతున్నారు. కానీ.. రిమ్స్ అధికారులు మాత్రం వారికి భద్రత కల్పించడంలో విఫలమయ్యారు.
కొనసాగుతున్న ఆందోళనలు..
రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను తొలగించాలని, మరోవైపు డాక్టర్ సందీప్ పవార్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో పది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెడికల్ విద్యార్థినికి మద్దతుగా అన్ని సంఘాలు, పార్టీలు, మహిళా సమాఖ్యలు మద్దతు తెలుపుతున్నాయి. రిమ్స్ డెరైక్టర్, డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దళిత సంఘాలు జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేపట్టగా, భారత జాతీయ మహిళా సమాఖ్య నాయకులు సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికోపై అత్యాచారం చేసిన డాక్టర్ సందీప్ పవార్, విద్యార్థినికి మతిస్థిమితం లేదని డాక్టర్ మద్దతు పలికి రిమ్స్ డెరైక్టర్ అశోక్‌పై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. కేసు నమోదు చేసి ఇన్ని రోజులైనా పోలీసులు జాప్యం చేయడం సరైంది కాదన్నారు. విద్యాబుద్ధులు చెప్పే ప్రొఫేసరే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా భద్రత చర్యలు చేపట్టాలన్నారు.
వైద్యుడి కోసం గాలిస్తున్నాం..
వైద్యుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీ సు బృందాన్ని పంపించాం. వైద్యుడి కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నాం. మొదట్లో హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించాం. ప్రస్తుతం సెల్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో హైదరాబాద్‌లోని తన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేయిస్తున్నాం. వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- సత్యనారాయణ, వన్‌టౌన్ సీఐ
Advertisement
Advertisement