రిమ్స్ గేటు ఎదుట ధర్నాచేస్తున్న మహిళా సంఘాలు
కీచక వైద్యుడి అరెస్టుకు రంగం సిద్ధం..
Published Mon, Aug 15 2016 11:12 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
⇒ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు
⇒ వివిధ పార్టీలు, దళిత, మహిళా సంఘాల ఆందోళనలు
ఆదిలాబాద్ క్రైం : అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో రిమ్స్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్ వైద్యుడు సందీప్ పవార్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. అతడి కాల్‌డాటా సేకరణతో పాటు, ఆయన సంబంధీకుల వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను తొలగించాలని, సందీప్ పవార్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన ప్రైవేట్ క్లినిక్‌ను మూసివేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
దళిత సంఘాలు, వివిధ పార్టీలు ఇప్పటికే ఈ విషయంలో ఆందోళన చేపట్టగా తాజాగా మహిళ సంఘాలు కూడా డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, మహిళ సంఘాలు ఆందోళనలు చేస్తున్పటికీ రిమ్స్ అధికారులు స్పందించకపోవడం శోచనీయం. గతంలోనే తనను వేధిస్తున్నాడంటూ రిమ్స్ అధికారులకు ఫిర్యాదులు చేసిన దీనిపై ఎలాంటి విచారణ చేయకుండానే చేతులెత్తేశారనే ఆరోపణలున్నారుు. సంబంధిత వైద్యుడికి సహకరించేందుకే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళా సంఘాల ఆందోళనలు
డాక్టర్ సందీప్ పవార్‌పై చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేస్తూ ఆదివారం రిమ్స్ ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద శ్రీసాయి మహిళ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని సంఘం అధ్యక్షురాలు బియ్యాల అనుసూయ డిమాండ్ చేశారు. సంఘం సభ్యులు జ్యోతి, త్రిశూల, రేణుక, రేఖ, తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్ డెరైక్టర్‌ను విధుల నుంచి తొలగించాలి
రిమ్స్ డాక్టర్ సందీప్ పవార్‌ను, కేసును పక్కదారి పట్టిస్తున్న రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర అంబేద్కర్ సంఘం నాయకులు ఆదివారం మానవహక్కుల కమిషన్‌కు పోస్టు ద్వారా వినతిపత్రం పంపించారు. డాక్టర్ సందీప్ పవార్‌ను వెంటనే అరెస్టు చేయాలని, పోలీసులు ఆలస్యం చేస్తే కేసు పక్కదారిపట్టే అవకాశముందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భోజనం రాములు అన్నారు. సుదూరప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిలకు రక్షణ కరువైందని, బాధితురాలికి మతిస్థిమితం లేదని నమ్మించిన డెరైక్టర్ అశోక్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
Advertisement
Advertisement