సెక్యూరిటీ గార్డుకి దేహశుద్ధి చేస్తున్న మహిళలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన వ్యక్తి బంధువుల అశ్లీల చిత్రాలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ సెక్యూరిటీ గార్డు దొరికిపోయారు. దీంతో అతడికి రోగి బంధువులతోపాటు అక్కడ ఉన్న మరికొంతమంది దేహశుద్ధి చేశారు. రిమ్స్‌లో ఆస్పత్రిలో ఫిమేల్ మెడికల్ (ఎఫ్‌ఎం) వార్డులో ఈ సంఘటన శుక్రవారం జరిగింది. రిమ్స్‌లో ఎఫ్‌ఎం వార్డులో నరసన్నపేటకు చెందిన రోగి బంధువు బాత్‌రూమ్‌లో ఉండగా ఆ వార్డులో విధులు నిర్వహిస్తున్న బలగ గ్రామానికి చెందిన ఒక సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండటాన్ని కొందరు మహిళలు గమనించారు.
విషయం తెలిసిన మహిళలందరూ దేహశుద్ధి చేశారు. రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ బి.సి.హెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులు కొంతమంది సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటీవల జీతాలను కోత పెట్టారు. పూర్తి జీతాల కోసం ఈనెల 9 నుంచి 19 రోజులు సమ్మెచేశారు. కాంట్రాక్టరు, అధికారుల చొరవతో ఈ సమస్య సద్దుమణిగింది. సమ్మె ముగిసిన రెండో రోజుల్లోనే సెక్యూరిటీ సిబ్బంది ఇటువంటి చర్యలకు పాల్ప డడం రిమ్స్‌లో చర్చనీయంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment