
సాక్షి, శామీర్‌పేట్: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అందులో ఒకరి మృతికి దారితీసిన ఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్‌కు చెందిన శివదులార్ రామ్(55), శామీర్‌పేట మండలం, బొమ్మరాశిపేట గ్రామ శివారులోని కమలాకర్‌రెడ్డికి చెందిన క్రషర్ మిషన్‌లో రెండేళ్లుగా సెక్యూరిటీకి గార్డుగా పని చేస్తున్నాడు.
కాగా అక్కడే ఉండే వేయింగ్ మెషిన్ వద్ద విజయ్ మరవి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కంకర లోడ్‌తో ఓ టిప్పర్ లారీ వేయింగ్ కొరకు రాగా అక్కడ విజయ్ మరవి లేకపోవడంతో సూపర్‌వైజర్ సుశాంత్ వచ్చి వేయింగ్ చేసి పంపించి, విజయ్ మరవిని మందలించాడు.
- తను వేయింగ్ మెషిన్ వద్ద లేడనే విషయం సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న శివదులార్ రామ్ సూపర్‌వైజర్‌కు చెప్పి ఉంటాడనుకొని అతనితో విజయ్ దు ర్భాషలాడుతూ గొడవపడ్డాడు. దీంతో ఇరువురిని సూపర్‌వైజర్ సుశాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
- ఉదయం 5 గంటల ప్రాంతంలో చెట్ల పోదల్లో శివదులార్‌రామ్ తీవ్రగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. వేయింగ్ మెషిన్ వద్ద పనిచేసే విజయ్ మరవి కనబడకపోవడమే కాక ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు.
(చదవండి: సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి గల్లంతు)
Comments
Please login to add a commentAdd a comment