Tipper Lorry
-
ఉచిత ఇసుక విధానానికి తూట్లు.. చంద్రబాబుపై టిప్పర్ ఓనర్లు ఆగ్రహం
-
బస్సును ఢీ కొట్టిన టిప్పర్.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, విజయవాడ: గొల్లపూడి వద్ద ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సు బోల్తా పడటంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్రేన్ సహాయంతో బస్సును అధికారులు తొలగించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? -
దూసుకొచ్చిన మృత్యువు
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: ఉదయాన్నే పొలం పనికి వచ్చి విరామ సమయంలో రోడ్డు వెంబడి కూర్చుని అన్నం తింటున్న రైతు, కూలీపై నుంచి టిప్పర్ లారీ దూసుకువెళ్లడంతో ఇద్దరూ మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ పల్టీ కొట్టడంతో డ్రైవర్ కూడా మరణించాడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. గొరిగనూరు గ్రామానికి చెందిన రైతు ఎనముల నాగసుబ్బారెడ్డి పొలంలో పని కోసం ఉదయం వ్యవసాయ కూలీలు వచ్చారు. కొద్దిసేపు పనిచేసిన తర్వాత ఎనిమిది మంది తమ వెంట తెచ్చుకున్న సద్దిమూటలు విప్పి అన్నం తినడానికి రోడ్డు పక్కన కూర్చున్నారు. ఆరుగురు కూలీలు అన్నం తినేసి మళ్లీ పనిలోకి వెళ్లారు. పొలం యజమాని ఎనముల నాగసుబ్బారెడ్డి(67), ధర్మాపురం గ్రామానికి చెందిన ఎనగలూరు ఓబులేసు(55) అనే కూలీ అన్నం తింటుండగా... జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు వైపునకు వెళుతున్న టిప్పర్ వేగంగా వారి మీదుగా దూసుకువెళ్లింది. దీంతో వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. ఇద్దరూ ఘటనాస్థలంలోనే మరణించారు. ఎస్.ఉప్పలపాడు గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ విజయ్‌కుమార్(58) వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అది పల్టీలు కొట్టి పొలంలో పడిపోయింది. డ్రైవర్ కూడా సీటు కింద నలిగిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. మృతులు సుబ్బారెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు.. ఓబులేసుకు భార్య, ఇద్దరు పిల్లలు, డ్రైవర్ విజయ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. డ్రైవర్ విజయ్‌కుమార్‌కు ఫిట్స్‌తోపాటు లోబీపీ ఉన్నట్లు తెలుసుకున్నారు. డ్రైవర్ నోట్లో నురగ రావడంతో ఫిట్స్ వచ్చినందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతిచెందిన ఓబులేసు, నాగసుబ్బారెడ్డి కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ధర్నాకు దిగిన బాధిత కుటుంబాలు దేవగుడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టిప్పర్‌ను మరొకరి వద్ద కొనుగోలు చేశాడు. టిప్పర్‌కు సంబంధించిన రికార్డులను తన పేరు మీద మార్చుకోకపోవడంతో పాటు ఇన్సూరెన్సు కూడా రెన్యూవల్ చేయించలేదు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌కు ఉన్న నంబర్ ప్లేట్‌ను తొలగించేశారు. దీంతో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా సమీపంలోని ధర్మాపురం, గొరిగనూరు గ్రామాల మహిళలు స్వచ్ఛందంగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు. రెండున్నర గంటలపాటు జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వచ్చి బాధితులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గొరిగనూరులో టిప్పర్ లారీ దూసుకెళ్లిన ఘటనలో ఓ రైతు, కూలీ మృతి చెందడం పట్ల సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. -
విప్రో జంక్షన్లో టిప్పర్ బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, హైదరాబాద్: బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వాహనం ఆదివారం అర్ధరాత్రి ఐటీ కారిడార్‌లో బీభత్సం సృష్టించింది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్‌లోని విప్రో జంక్షన్లో సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న 3 కార్లను, 3 బైక్‌లను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ టిప్పర్‌ను ఢీకొని అది ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. బైక్‌లపై వెళుతున్న ఇద్దరు, టిప్పర్ సూపర్వైజర్ తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఖానామెట్‌లోని ఓ సైట్లో బండరాళ్లు లోడ్ చేసుకున్న టిప్పర్.. వట్టినాగులపల్లిలోని క్రషర్లో అన్లోడ్ చేసేందుకు బయలుదేరింది. ఆదివారం అర్ధరాత్రి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్‌కు చేరుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో అప్పటికే కార్లు బైక్‌లు ఆగి ఉన్నాయి. టిప్పర్ అతివేగంతో దూసుకువచ్చి మొదట స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు ముందున్న ఐ20 కారు, ఇండిగో కార్లను బలంగా తాకడంతో అవి నుజ్జునుజ్జయ్యాయి. కార్లను ఢీకొట్టిన టిప్పర్ ఎడమ వైపు దూసుకెళ్లి మూడు బైక్‌లను ఢీకొంది. అంతటితో ఆగకుండా గౌలిదొడ్డి వైపు నుంచి వస్తున్న మరో టిప్పర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న నాంపల్లికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్ హుస్సేన్ (30) తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు.. యమహా బైక్‌పై ఉన్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ రజాక్ కుడి కాలు విరిగింది. వెనకాల ఉన్న యువకుడు సురక్షితంగా బయపడ్డాడు. మరో బైక్‌పై ఉన్న సుబెందుదాస్ ఎడమ కాలు విరగడంతో కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. టిప్పర్‌లో ఉన్న ఖలీం అందులోనే ఇరుక్కుపోవడంతో కాలు విరిగింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లు సురక్షితం.. నుజ్జునుజ్జయిన స్విఫ్ట్ కారులో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ మురళి రెండు బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఐ 20 కారులో గౌలిదొడ్డి వైపు వస్తున్న దంపతులు సాయి చైతన్య, పల్లవి, కుటుంబ సభ్యులు సాహితి, సుదీప్తిలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ధ్వంసమైన ఇండిగో కారు క్యాబ్ డైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన టిప్పర్ డ్రైవర్.. టిప్పర్ బీభత్సానికి కారణమైన డ్రైవర్ కాసీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ చెందిన ఇతను మూడు రోజుల క్రితమే నగరానికి వచ్చి డ్రైవర్ విధుల్లో చేరినట్లు సమాచారం. ఖానామెట్ నుంచి వట్టినాగులపల్లికి వెళ్లే దారి తెలియకపోవడంతో అతని వెంట సూపర్వైజర్ ఖలీం వచ్చారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటడం, విప్రో జంక్షన్లో ఏటవాలు ఎక్కువగా ఉన్న విషయంపై అవగాహన లేకపోవడంతో టిప్పర్ అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ గోనె సురేష్‌లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సీఐ గోనె సురేష్ స్పష్టం చేశారు. -
అపార్థమే.. హత్యకు దారితీసింది
సాక్షి, శామీర్‌పేట్: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అందులో ఒకరి మృతికి దారితీసిన ఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్‌కు చెందిన శివదులార్ రామ్(55), శామీర్‌పేట మండలం, బొమ్మరాశిపేట గ్రామ శివారులోని కమలాకర్‌రెడ్డికి చెందిన క్రషర్ మిషన్‌లో రెండేళ్లుగా సెక్యూరిటీకి గార్డుగా పని చేస్తున్నాడు. కాగా అక్కడే ఉండే వేయింగ్ మెషిన్ వద్ద విజయ్ మరవి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కంకర లోడ్‌తో ఓ టిప్పర్ లారీ వేయింగ్ కొరకు రాగా అక్కడ విజయ్ మరవి లేకపోవడంతో సూపర్వైజర్ సుశాంత్ వచ్చి వేయింగ్ చేసి పంపించి, విజయ్ మరవిని మందలించాడు. తను వేయింగ్ మెషిన్ వద్ద లేడనే విషయం సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న శివదులార్ రామ్ సూపర్వైజర్కు చెప్పి ఉంటాడనుకొని అతనితో విజయ్ దు ర్భాషలాడుతూ గొడవపడ్డాడు. దీంతో ఇరువురిని సూపర్వైజర్ సుశాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో చెట్ల పోదల్లో శివదులార్రామ్ తీవ్రగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. వేయింగ్ మెషిన్ వద్ద పనిచేసే విజయ్ మరవి కనబడకపోవడమే కాక ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి గల్లంతు) -
నాటేసేందుకు వెళ్తుండగా కాటేసిన మృత్యువు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చండ్రుగొండ: నాటేసేందుకు బయలుదేరినవారి లో నలుగురిని మృత్యువు టిప్పర్ రూపంలో కాటేసింది. మరో 13 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మృతులు, క్షతగాత్రులందరూ ఒకే గ్రామానికి చెందినవారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బొగ్గులోడ్ తో వెళ్తున్న ఓ టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీకొని 100 మీటర్ల వరకు బొలేరోను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న ఇంటి ముందు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కూలీలు కత్తి స్వాతి(26), ఎక్కి రాల సుజాత(35) అక్కడికక్కడే మృతి చెం దగా, గాయపడిన కత్తి సాయమ్మ, గుర్రం లక్ష్మి కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. మరోకూలీ కత్తి లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. కత్తి నాగయ్య, ఆయన భార్య వెంకటరమణ, కత్తి సుగుణ, గుర్రం అచ్చమ్మ, రాందాస్, గుర్రం నర్సమ్మ, కత్తి సుశీల, వెంకటనారాయణ, పిడమర్తి సావిత్రి, రైతు ఆళ్ల వీరయ్య, ఆయన భార్య ఆళ్ల పద్మ, బొలెరో డ్రైవర్ రాందాస్ కూడా గాయాలపాలయ్యారు. వీరి లో కొందరికి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో, మరికొందరిని ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఎవరీ కూలీలు చండ్రుగొండ మండలంలోని తుంగారం గ్రామానికి చెందిన ఆళ్ల వీరయ్య తన వరి పొలం నాటు వేసేందుకు సుజాతనగర్ మండలం హరిజనవాడకు చెందిన 15 మంది కూలీలను మాట్లాడుకున్నాడు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని రాజాపురంలో ఓ రైతు వద్ద కొనుగోలు చేసిన నారును తీసుకురావడానికి బొలేరో వాహనంలో కూలీలను తీసుకొని బయల్దేరాడు. మార్గమధ్యంలో తిప్పనపల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరోలో డ్రైవర్‌తోపాటు 16 మంది ఉన్నారు. టిప్పర్ తమ ఇంటి ముం దే బోల్తా పడిందని, అక్కడే ఉన్న తాము తృటి లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని ఖాజాబీ, ఆమె మనవడు అబ్దుల్ ముఖీబ్ ‘సాక్షి’తో చెప్పారు. పదిగంటలపాటు ఆందోళన బొగ్గు లారీల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుల బంధువులు, స్థానికులు తిప్పనపల్లిలో హైవేపై పదిగంటలపాటు ఆందోళనకు దిగారు. ఆర్డీవో స్వర్ణలత ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సింగరేణి డైరెక్టర్(పా) చెన్నై నుంచి ఫోన్లో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.50 వేల తక్షణసాయం, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు విషయమై మంత్రులతో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి
సాక్షి, హయత్‌నగర్/రామగిరి(నల్లగొండ): రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎంపీటీసీ సభ్యురాలితోపాటు ఆమె భర్త మృతిచెందారు. పోలీసుల కథ నం ప్రకారం నల్లగొండ జిల్లా అనిశెట్టి దుప్పలపల్లి చెంది న దొంతం కవిత (40) తిప్పర్తి మండలంలోని థానేదార్పల్లి ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి(52) బిల్డర్. హైదరాబాద్‌లో మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్ సమీపంలో వీరు ఉంటున్నారు. కూతురు వివాహంకోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్‌లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్‌లోని నివాసానికి వచ్చేందుకు రాత్రి 8.30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట్‌లోని ఔటర్ రింగురోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళుతున్న టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేకు వేశాడు. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఈ దంపతుల వాహనం టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కవిత, ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసులు సీరియస్ పాడె మోస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిప్పర్ కింద ఇరుక్కుపోయిన వాహనం.. టిప్పర్‌ను స్కార్పియో వాహనం వెనుకనుంచి వేగంగా ఢీ కొట్టడంతో టిప్పర్ కింద ఇరుక్కుని స్కార్పియో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు చాలాసేపు శ్రమించాల్సి వచ్చిందని, అప్పటికే వారు మృతి చెందారని స్థానికులు తెలిపారు. కూతురి వివాహం.. అంతలోనే విషాదం కవిత, వేణుగోపాల్‌రెడ్డి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తుండగా ఎంబీబీఎస్ చదివిన కూతురుకు ఆగస్టు 20న వివాహం జరిపించారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడం అందరిని కలచి వేసింది. బుధవారం మృతుల అంత్యక్రియలు వారి స్వగ్రామం తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో జరిగాయి. అంతిమయాత్రలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని పాడె మోశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు మృతులకు నివాళులర్పించారు. -
అబ్దుల్లాపూర్ మెట్లో టిప్పర్ బీభత్సం
సాక్షి,రంగా రెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం కూడలి వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెల్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఆగి ఉన్నా ఆటోలపైకి దూసుకెళ్లిన టిప్పర్ బోల్తాపడటంతో రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న అయిదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సహాయంతో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘోరం
కర్ణాటక, చిక్కబల్లాపురం : ఆలయానికి వెళ్లి వస్తుండగా మృత్యువు వెంటాడింది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొని తర్వాత టిప్పర్ కిందకు దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరం సమీపంలోని అగలగుర్కి వద్ద జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురం తాలూకా మంచనబలె గ్రామానికి చెందిన దీప(22). మంగళవారం ఆమె తనకుటుంబ సభ్యులతో కలిసి కారులో బెంగళూరు చిక్కజాల ఉప్పారహళ్లి లోని మునేశ్వరదేవాలయం వెళ్లింది. పూజలు ముగించుకొని వస్తుండగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో అగలగుర్కి సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని టిప్పర్ లారీ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న దీప అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న జయమ్మ, రత్నమ్మ, శాంత, పవన్, సంగీతలు తీవ్రంగా గాయపడగా వారిని బెంగళూరుకు తరలించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వరుణ్‌కుమార్ తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్
ఆత్మకూరు: రోడ్డు పనుల కోసం కంకర తీసుకెళుతున్న టిప్పర్ విద్యుత్ స్తంభం స్టే వైరును ఢీకొనడంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఘోర ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామస్వామిపల్లి గ్రామం బీసీ కాలనీలో రెండురోజులుగా సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పనుల కోసం కంకరలోడు తీసుకెళుతున్న టిప్పర్ ఆ వీధిలోని విద్యుత్ స్తంభం స్టే వైరును ఢీకొంది. దీంతో పెద్ద శబ్దంతో ఆ స్తంభంతోపాటు సమీపంలోని మరో స్తంభం, విద్యుత్ తీగలు నేలవాలాయి. ఆ సమయంలో వీధిలో ఎక్కువ జనసంచారం లేకపోవడం, ఢీకొన్న వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. దీనికితోడు కాలనీలోని పలు వీధుల్లో విద్యుత్ తీగలు కిందుగా వేలాడుతున్న విషయాన్ని ఏఈకి సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని, రోడ్డు పనుల సమయంలోనూ చర్యలు తీసుకోవాలని కోరినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ స్తంభాల మధ్య నిడివి ఎక్కువ దూరంగా ఉండడంతో గ్రామస్తులే తాటిమొద్దును ఆసరగా నిలబెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినా వారు నింపాదిగా సాయంత్రం వచ్చారని చెబుతున్నారు. సరఫరా నిలిచిపోవడంతో పండగ రోజుల్లో పనులకు అంతరాయంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. విచారిస్తే అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లినట్లు సమాచారం తెలిసిందని గ్రామస్తులు తెలిపారు. -
శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్‌లో టిప్పర్ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో 2 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన మండల పరిధి చింతల గిరిజన గూడెం సమీపంలో శుక్రవారం జరిగింది. శ్రీశైలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో సంఘటన స్థలానికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అందిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం నుంచి శ్రీశైలానికి కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ టైర్.. మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చింతల వద్ద బరస్టయింది. టిప్పర్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. వారి వివరాలు తెలియలేదు. రోడ్డు పక్కన కొంత మేర ఖాళీ ఉండటంతో చిన్న వాహనాలు మాత్రం ట్రాఫిక్ నుంచి బయట పడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్ బస్సులు, టారీలు టిప్పర్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కొందరు ఆర్టీసీ, టిప్పర్ల సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ఉన్న టిప్పర్‌ను తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్ఐ రామకోటయ్య, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న టిప్పర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. సుమారు 2 గంటల తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో ప్రయాణాకులు బతుకు జీవుడా..అంటూ బయటపడ్డారు. ప్రయాణికుల అవస్థలు ట్రాపిక్కు అంతరాయం ఏర్పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. సుమారు 43 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నట్టనడివిలో వాహనాలు నిలిచి పోవడంతో ఆయా వాహనాల్లో ప్రయాణించే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం తొలగే వరకూ తీవ్ర ఉక్కపోత నడుమే ప్రయాణికులు తమ తమ వాహనాల్లో ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు వాహనాల్లో ఉండలేక సమీపంలో ఉన్న చెట్ల నీడన సేదతీరినా భానుడి ప్రచండ వీక్షణాలకు తట్టుకోలేక అల్లాడిపోయారు. ప్రయాణికుల నీటి ఇబ్బందులను ముందే గ్రహించిన ఎస్ఐ రామకోటయ్య తన వాహనంలో కూల్ కంటైనర్‌తో నీరు తెప్పించి ప్రయాణికుల దాహార్తి తీర్చారు. -
టిప్పర్ ఢీకొని ఒకరి మృతి
అన్నపురెడ్డిపల్లి : మండలంలోని బూర్గుగూడెం గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మణుగూరు మండలంలోని కూనవరం గ్రామం పీవీ కాలనీకి చెందిన తాడ్వాయి శ్రీనివాసరావు(43), మూడు నెలల క్రితం టాటా మ్యాజిక్ ఆటో కొన్నాడు. దానికి విజయవాడలో మరమ్మతులు చేయించి, మంగళవారం రాత్రి అక్కడి నుంచి బయల్దేరాడు. బుధవారం తెల్లవారుజామున బూర్గుగూడెం గ్రామ సమీపంలో, కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వెళుతున్న బొగ్గు టిప్పర్ ఢీకొంది. తాడ్వాయి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ డేరంగుల నాగరాజు, ప్రయాణిస్తున్న వేమ రవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడ్వాయి శ్రీనివాసరావు భార్య నీలమణి ఫిర్యాదుతో ప్రమాద స్థలాన్ని ఎస్సై కడారి ప్రసాద్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. బస్సు, రెండు కార్లు ఢీ కారేపల్లి : ఖమ్మం–ఇల్లందు రహదారిపై అనంతారం తండా స్టేజీ వద్ద బుధవారం బస్సు, రెండు కార్లు ఢీకొన్నాయి. ముప్పు తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఖమ్మం నుంచి ఇల్లందు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు, అనంతారం స్టేజీ వద్ద ప్రయాణికులను దింపేందుకు ఆగింది. వెనుకగా వస్తున్న రెండు కార్లు అదుపుతప్పి ఒక్కసారిగా బస్సును ఢీకొన్నాయి. బస్సు వెనుక భాగం, కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. కార్ల వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రమాద స్థలాన్ని ఎస్ఐ కిరణ్ కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు అన్నపురెడ్డిపల్లి : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని నామవారం గ్రామం వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన గంటా అజయ్ కుమార్, ద్విచక్ర వాహనంపై అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామం వైపు వెళుతున్నాడు. ఇదే మండలంలోని పెంట్లం గ్రామానికి చెందిన బన్నె నరసింహారావు, రాజాపురం నుంచి ద్విచక్ర వాహనంపై పెంట్లం వెళుతున్నాడు. నామవారం గ్రామం వద్ద ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వాహన చోదకులైన అజయ్‌కుమార్, నరసింహారావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మృత్యు శకటాలు
-
వనస్థలిపురంలో.. టిప్పర్ లారీ బీభత్సం
-
సుష్మ థియేటర్ వద్ద టిప్పర్ లారీ బీభత్సం
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుష్మ థియేటర్ వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వాహనాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 4 ఆటోలు, 2 బైకులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడే ఉన్న ప్రజలు పరుగు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
స్టీరింగ్ ఆటో, టిప్పర్ ఢీ
పుల్కల్ : ఎదురెదురుగా వస్తున్న స్టీరింగ్ ఆటో, టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఎదుట సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన దండుగల నరసింహులు (42), అదే గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శోభ (28), కమ్మరికత్త గ్రామానికి చెందిన స్వరూప (30)లు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వీరి కుటుంబాలు పనుల నిమిత్తం పటాన్చెరు ప్రాంతానికి వలస వచ్చారు. అయితే సోమవారం స్వ గ్రామానికి బయలుదేరారు. అందులో భాగంగానే పటాన్చెరు నుంచి జోగిపేట కు వెళుతున్న స్టీరింగ్ ఆటోను ఎక్కారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీ యూ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు, శోభ, స్వరూపలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నరసింహులుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బైక్‌పై వెళ్లింటే... స్వరూప, సుధాకర్ దంపతులు కూడా కూలీ పనుల నిమిత్తం పటాన్చెరు లింగంపల్లికి వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే కుమారులు స్వగ్రామంలో చదువుతుండగా.. వీరిని కమ్మరికత్తలో వదలాల ని దంపతులు నిర్ణయించారు. అందులో భాగంగానే సోమవారం సుధాకర్, ఇద్దరు కుమారులు బైక్‌లో బయలుదేరగా.. స్వరూప కుమార్తె నిఖితలు ఆటోలో బయలుదేరారు. అయితే స్వరూపను వృుత్యువు ఆటో రూపంలో కబలించగా.. నిఖిత స్వల్పగాయాలతో బయటపడింది. కాగా ప్రమాదం జరిగిన అనంతరం పోలీసులు పూర్తిస్థాయి సమాచారం కోసం సుధాకర్ మోబైల్‌కు ఫోన్ చేశారు. అతను సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బైక్‌లో అందరం వచ్చి ఉంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే వారం కాదా అంటూ సుధాకర్ విలపించడం అక్కడివారిని కలిచివేసింది. గాయాలైన వారిని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. రెండు వాహనాల డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.