
టిప్పర్ కింద నలిగిపోయిన కారు
కర్ణాటక, చిక్కబల్లాపురం : ఆలయానికి వెళ్లి వస్తుండగా మృత్యువు వెంటాడింది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొని తర్వాత టిప్పర్ కిందకు దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరం సమీపంలోని అగలగుర్కి వద్ద జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురం తాలూకా మంచనబలె గ్రామానికి చెందిన దీప(22). మంగళవారం ఆమె తనకుటుంబ సభ్యులతో కలిసి కారులో బెంగళూరు చిక్కజాల ఉప్పారహళ్లి లోని మునేశ్వరదేవాలయం వెళ్లింది. పూజలు ముగించుకొని వస్తుండగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో అగలగుర్కి సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని టిప్పర్ లారీ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న దీప అక్కడికక్కడే మృతి చెందింది.
కారులో ఉన్న జయమ్మ, రత్నమ్మ, శాంత, పవన్, సంగీతలు తీవ్రంగా గాయపడగా వారిని బెంగళూరుకు తరలించినట్లు ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ వరుణ్‌కుమార్ తెలిపారు.