సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుష్మ థియేటర్ వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వాహనాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 4 ఆటోలు, 2 బైకులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడే ఉన్న ప్రజలు పరుగు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment