
సాక్షి,రంగా రెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం కూడలి వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెల్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఆగి ఉన్నా ఆటోలపైకి దూసుకెళ్లిన టిప్పర్ బోల్తాపడటంతో రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న అయిదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సహాయంతో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment