Vanasthali puram
-
హైదరాబాద్ వనస్థలీపురంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
6 రోజుల నిరీక్షణ.. అంతయ్య మృతదేహం లభ్యం
సాక్షి, హైదరాబాద్: డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన అంతయ్య మృతదేహం ఎట్టికేలకు లభ్యమైంది. గల్లంతైన మృతదేహం కోసం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతూ గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 6 రోజుల తర్వాత అంతయ్య మృతదేహం బయటపడింది. కాగా గల్లంతైన ప్రాంతం నుంచి 350 మీటర్ల దూరంలో మృతదేహం దొరికినట్లు అధికారులు తెలిపారు. 6 రోజుల నిరీక్షణ అనంతరం.. బెంగుళూరుకు చెందిన అజంతా సొల్యూషన్స్ టెక్నాలజీ వారి నూతన టెక్నాలజీ కెమెరా పరికరాలతో మొదటగా ట్రంక్ లైన్ లో గుర్తించగా కొద్దిసేపటికే పక్కనే ఉన్న మ్యాన్ హోల్ వద్దకి మృతదేహాం వచ్చి ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే మృతదేహాన్ని బయటకు తీసే పనిలో పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందితో బయటకు తీయిస్తున్నారు. అంతయ్య కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, మృతికి కారణమైన అధికారులని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఎల్బీ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్లో డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్లో దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ప్రాణాలు విడిచారు. మొదట ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా గల్లంతయ్యాడు. శివ మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. అనంతయ్య మృతదేహాం కోసం ఆ రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా సోమవారం నాడు దొరికింది. -
నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం
-
నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం
వనస్థలిపురం: నగరంలో ముగ్గురు బాలికలు అదృశ్యమవడం కలకలం రేపింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. ఈ ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్లో ఉండే ముగ్గురు బాలికలు (17),(15),(14) ఏళ్లు తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ విషయంలో వీరి తల్లి పెద్ద కుమార్తెను మందలించింది. దీంతో తల్లి, ముగ్గురు కుమార్తెల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా, శనివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి ముగ్గురు కుమార్తెలు ఇంట్లో కనిపించలేదు. వారి ఆచూకీ కోసం ఆ పరిసరాల్లో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: కొత్త ట్విస్ట్: వదినా..మరిది..కొడుకు.. ఓ క్రైం కథ ) -
డెలివరీ కోసం వెళ్తే.. ప్రాణం తీశారు
సాక్షి, వనస్థలిపురం : వనస్థలిపురం లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో అందించిన వైద్యం వికటించడంతో శ్వేత(28) అనే మహిళ మృతి చెందింది. వివరాలు.. చౌటుప్పల్కి చెందిన శ్వేత ప్రసవం కోసం గత నెలలో లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు పెద్ద పేగు కత్తిరించారు. ఆ తర్వాత ఒక పేగుకు బదులు మరో పేగు అతికించారు. అంతేకాకుండా కుట్లు కూడా సరిగా వేయలేదు. దీంతో ఇన్ఫెక్షన్ సోకి శ్వేత మరణించింది. కాగా వైద్యులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో శ్వేత మరణించిందని ఆమె బంధువులు ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యంగానే ఆమె మృతి చెందిందని ఆరోపించారు. -
వనస్థలిపురంలో.. టిప్పర్ లారీ బీభత్సం
-
సుష్మ థియేటర్ వద్ద టిప్పర్ లారీ బీభత్సం
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుష్మ థియేటర్ వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వాహనాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 4 ఆటోలు, 2 బైకులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడే ఉన్న ప్రజలు పరుగు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
ఇద్దరు కిలేడీలు అరెస్ట్
తుర్కయంజాల్: మాటలతో నమ్మించి, మోసం చేసి దుస్తులను చోరీ చేసి అమ్మడానికి వెళ్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైమ్ ఎస్సై సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మంకు చెందిన నల్లగొండ నారాయణ భార్య రమాతులసి (45), బాలసాని రవి భార్య కుమారి (40)లు ఇద్దరు కలిసి ఈ నెల 19న వనస్థలిపురంలోని గేట్వేకాలనీలోగల కాటన్ ఎక్స్పో బట్టల దుకాణంలోకి వెళ్లారు. అనంతరం వీరితో పాటు వీరికి చెందిన మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అంతా కలిసి బట్టలు కావాలంటూ బేరసారాలు చేశారు. ఈ సమయంలో వారు సుమారు 200పైగా టీషర్ట్లతోపాటు కొన్ని చీరలను కళ్లుగప్పి ఎత్తుకెళ్లారు. అనంతరం ఈ నెల 20న ఉదయం వేళలో ఎస్కేడీనగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీలలో ఉన్న పోలీసు సిబ్బందికి అనుమానాస్పదంగా బట్టల మూటలు తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వీరిని విచారించగా సుమారు రూ.1.70 లక్షల విలువ చేసే బట్టలు పట్టుబడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు మహిళలను రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు మహిళలు పరారీలో ఉన్నారు. -
పసిగుడ్డును వదిలేశారు..
వనస్థలిపురం పరిధిలోని సాగర్రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేశారు. శనివారం ఉదయం అటుగా వెళ్లే ఆటో డ్రైవర్లు చిన్నారి ఏడుపు విని.. చుట్టు పక్కల గమనించగా.. బ్యాగ్ లో ఉంచిన ఆడ శిశువు కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును సమీపంలోని శిశువిహార్ లో అప్పగించారు. శిశువు మూడు, నాలుగు రోజుల క్రితం జన్మించి ఉంటుందని భావిస్తున్నారు. -
పేకాటస్థావరాలపై పోలీసుల దాడులు
హైదరాబాద్: నగర శివారు వనస్థలిపురం బ్రాహ్మణపల్లిలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరుల నుంచి మూడు కార్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉప సర్పంచ్ సహా వార్డు మెంబర్ ఉన్నట్టు సమాచారం. సంకాంత్రి సందర్భంగా ఓ వైపు పూజా కార్యక్రమాలతో భక్తులు లీనమై ఉండగా, మరో వైపు జూదాలు, బెట్టింగ్లతో జూదరులు గడుపుతున్నారు.