
సాక్షి, వనస్థలిపురం : వనస్థలిపురం లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్‌లో అందించిన వైద్యం వికటించడంతో శ్వేత(28) అనే మహిళ మృతి చెందింది. వివరాలు.. చౌటుప్పల్‌కి చెందిన శ్వేత ప్రసవం కోసం గత నెలలో లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు పెద్ద పేగు కత్తిరించారు. ఆ తర్వాత ఒక పేగుకు బదులు మరో పేగు అతికించారు. అంతేకాకుండా కుట్లు కూడా సరిగా వేయలేదు. దీంతో ఇన్ఫెక్షన్ సోకి శ్వేత మరణించింది. కాగా వైద్యులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో శ్వేత మరణించిందని ఆమె బంధువులు ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యంగానే ఆమె మృతి చెందిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment