సాక్షి, ఆదిలాబాద్: కేసీఆర్ సర్కార్ రిమ్స్ ఆస్పత్రికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క రిమ్స్‌లోనే 100 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇక్కడ ఐసోలేషన్‌లో పేషెంట్లు భయంతో ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. (చదవండి: ఏం డాక్టర్‌వయ్యా.. దిమాక్ ఉందా?)
కరోనా బాధితులను సర్కార్ గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చావులన్నీ ప్రభుత్వ హత్యలుగా పేర్కొన్నారు. తెలంగాణలో ఏ ఒక్క ఆస్పత్రి సరిగా లేదన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతామని హెచ్చరించారు. (చదవండి: ఫామ్‌హౌస్‌కు వెళ్లడంకాదు.. ప్రజల్లో ధైర్యం నింపండి )
Comments
Please login to add a commentAdd a comment