రిమ్స్‌లో ఎంసీఐ బృందం పరిశీలన
Published Tue, Dec 31 2013 2:46 AM | Last Updated on Tue, Oct 9 2018 5:50 PM
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ సెన్సైస్(రిమ్స్) వైద్య కళాశాల, ఆస్పత్రులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) బృందం సోమవారం పరిశీలించింది. రిమ్స్‌లో పీజీ కోర్సుల ప్రారంభానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఈ బృందం వచ్చింది. 13 విభాగాల్లో పీజీ కోర్సు ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ రిమ్స్ అధికారులు ప్రతిపాదనలు పంపగా మొదటి విడత మూడు విభాగాల్లో సౌకర్యాలను ఎంసీఐ బృందం సభ్యులు పరిశీలించారు. ఆప్తమాలజీ విభాగాన్ని డాక్టర్ రేణుక దేశాయ్(పాండిచ్చేరి), సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాన్ని డాక్టర్ మల్లిక్(రోహ్‌తక్), బయో కెమిస్ట్రీ విభాగాన్నిడాక్టర్ భట్టాచార్య(అసోం) పరిశీలించారు. రోజుకు ఎన్ని కేసులు వస్తున్నాయి, ఏయే సేవలు అందుతున్నాయి, ఏయే పరికరాలు ఉన్నాయి, ఏయే శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయనే అంశాలను తెలుసుకున్నారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారని ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికలు, రికార్డులను పరిశీలించారు. వీరివెంట రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ టి.జయరాజ్, సూపరింటెండెంట్ అరవింద్, ఆర్‌ఎంవో లూకలాపు ప్రసన్నకుమార్, ఏఆర్‌ఎంవో బి.సీహెచ్.అప్పలనాయుడు, రిమ్స్ ఆరోగ్యశ్రీ కోఅర్డినేటర్ డాక్టర్ సంపత్‌కుమార్ ఉన్నారు.
Advertisement
Advertisement