ఆడపిల్ల పుట్టిందని..
Published Tue, Jul 25 2017 4:15 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
ఆదిలాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రిలోనే వదిలేసిపోయిందో తల్లి. ఈ సంఘటన ఆదిలాబాద్ రిమ్స్‌లో చోటు చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులుకు, ఆసుపత్రికి సిబ్బందికి తెలియజేయగా వారు పాపను శిశుగృహానికి తరలించారు. పాప సంబంధీకులు ఎవరైనా 60 రోజుల లోపలవచ్చి తీసుకువెళితే సరి.. లేదంటే తర్వాత పాపను దత్తతకు ఇస్తామని ఐసీడీఎస్ అధికారి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాప వయసు 5 రోజులు ఉంటుందని వైద్యులు నిర్దారించారు.
Advertisement
Advertisement