
కడప కోటిరెడ్డిసర్కిల్ : మైదుకూరు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సులో మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వేపరాల యర్రన్న (80) మృతి చెందారు. ఈయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధతున్నారు. ఇతన్ని భార్య సాలమ్మ రిమ్స్‌కు తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో సీటులోనే కుప్పకూలి మృతి చెందాడు. బస్సు బస్టాండుకు రాగానే ఆర్టీసీ సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ శివారెడ్డి, కానిస్టేబుల్ రవి, చిన్నచౌకు ఔట్‌పోస్టు సిబ్బంది గోపాల్‌లు మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారితో కలిసి మృతదేహాన్ని తిప్పిరెడ్డిపల్లెకు పంపించే ఏర్పాట్లు చేశారు.
చదవండి: జాతరకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment