కడప అర్బన్ : కడపలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో భాగ్యనగర్‌కు చెందిన లక్ష్మినారాయణరెడ్డి తన ఇంటి పక్కనున్న బాత్‌రూము పైపులైన్ పగులగొట్టించేందుకు గంగులయ్య అనే తన స్నేహితుని ద్వారా కూలీలను శనివారం ఉదయం పిలిపించాడు. వారు పని చేస్తుండగా సిద్దారెడ్డి, ఇంకా కొంత మంది కలిసి పక్కింటిలో నివసిస్తున్న రేవతి అలియాస్ అనసూయకు అనుకూలంగా లక్ష్మినారాయణరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మినారాయణరెడ్డి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దారెడ్డి, అతని కుమారుడు, రేవతి అలియాస్ అనసూయ, ఆమె కుమార్తె, అల్లుడు ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల చిన్నచౌకు ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు.