అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి | Sick to death of the prisoner's life | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి

Published Tue, Feb 14 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

Sick to death of the prisoner's life

కడప అర్బన్‌ : కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బొరుసు శ్రీనివాసులు (47) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై సీఐ మోహన్‌ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు....వేంపల్లె పట్టణం శ్రీరామ్‌నగర్‌కు చెందిన బొరుసు శ్రీనివాసులు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉంటూ 2011 ఏప్రిల్‌ 21న జీవిత ఖైదు పడడంతో కడప కేంద్ర కారాగారానికి వచ్చాడు. అప్పుడప్పుడు అనారోగ్యంతో బాధపడేవాడు. ఈ ఏడాది జనవరి 30న అనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్‌లో చేరాడు. మంగళవారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ లక్ష్మినరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement