రిమ్స్ (కడప అర్బన్) : కడప రిమ్స్‌లో త్వరలో 10 పడకలతో కూడిన కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ అరుణకుమారి తెలిపారు. అలాగే చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి మరో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. శుక్రవారం రిమ్స్‌లోని ఐపీ విభాగంలో క్యాజువాలిటీ విభాగంతోపాటు పలు వార్డులను పరిశీలించారు. అనంతరం ఓపీ విభాగానికి వచ్చి అక్కడ మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలలో తన రక్త నమూనాలను పరీక్షల కోసం ఇచ్చి ఎలా పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డెరైక్టర్ కార్యాలయంలో డాక్టర్ సిద్దప్ప గౌరవ్‌తో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ నారాయణ నాయక్, డీఐఓ నాగరాజు, మలేరియా అధికారి త్యాగరాజు, రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ గిరిధర్, మైక్రో బయాలజీ ప్రొఫెసర్ శశిధర్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన రీతిలో వైద్యసౌకర్యాలు
రాజంపేట: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ అరుణకుమారి అన్నారు. శుక్రవారం ఆమె రాజంపేటలోని ఏరియా హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైద్యశాఖలో 416పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేదని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్ ఆమె వెంట ఉన్నారు.
రిమ్స్‌కు త్వరలో కార్డియాలజీ విభాగం
Published Sat, Dec 6 2014 3:18 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement