
ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే ఒకే ఊరు లేదంటే ఒకే ప్రాంతం వరకు అన్నట్లే ఉండేవి.

కానీ చాన్నాళ్ల క్రితమే ట్రెండ్ మారిపోయింది. విదేశీయులు కూడా మనోళ్లని పెళ్లాడుతున్నారు.

అలా గ్లామరస్ ఫారెన్ సింగర్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్ గురించే ఈ స్టోరీ.

'రోడిస్' షోతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు రఘురామ్.

ఈ పేరు చెబితే గుర్తురాకపోవచ్చు గానీ నున్నని గుండుతో ఉన్న ఫొటో చూస్తే గుర్తుపట్టేస్తారు.

తమిళంలో 'డాక్టర్' మూవీలోనూ విలన్ గ్యాంగ్ మెంబర్‌గా నటించాడు.

రఘురామ్ పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలోని మచిలీపట్నంలో. కానీ హిందీలో తొలుత ఫేమ్ వచ్చింది.

హిందీ తర్వాత తమిళంలో.. రీసెంట్ టైంలో 'కీడాకోలా', 'మెకానిక్ రాకీ' లాంటి తెలుగు మూవీస్ చేశాడు.

ఇతగాడు ఏకంగా కెనడాకు చెందిన సింగర్ నటాలియాని నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

వీళ్లిద్దరూ ఈ మధ్యే ఐదో వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకున్నారు. రఘు కొన్ని పోస్ట్ చేశాడు.

ఇవి చూసిన చాలామంది.. రఘురామ్‌కి ఇంత అందమైన భార్య ఉందని తెలిసి షాక్ అవుతున్నారు.







