ఈ రోజుల్లో ఫొటోషూట్‌లు సర్వసాధారణమైపోయాయి. జీవితంలో ముఖ్యమైన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి మంచి లోకేషన్లకు వెళ్లి షూట్‌లు నిర్వహిస్తున్నారు. బర్త్‌డే, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, ప్రెగ్నెన్సీ.. ఇలా చాలా సందర్బాల్లో వినూత్న రీతిలో ఫొటోలు దిగుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతున్నారు.
తాజాగా ఇలాంటి ఫొటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఓ మహిళతో పాటు ఆమె అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి. ఒకేసారి మూడు తరాలకు చెందిన మహిళలు గర్భం దాల్చడం అత్యంత అరుదు కావడంతో ఈ ఫొటోలు, వీడియోను చూసిన వారు తెగ కామెంట్లు చేశారు. ఇతరులకు కూడా షేర్ చేసి వాటిని వైరల్ చేశారు.
నిజంగా సాధ్యమేనా?
ఒకేసారి మూడు తరాలకు చెందిన మహిళలు గర్భం దాల్చడం నిజంగా సాధ్యమేనా? అంటే దాదాపు అసాధ్యమే. ఈ వీడియో కూడా నిజం కాదు లేండి. ఇందులో కన్పిస్తున్న యువతి మాత్రమే గర్భం దాల్చింది. ఆమె అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ దిండు ధరించి ఫొటోషూట్‌లో ప్రెగ్నెంట్‌లా కన్పించారు.
ఎందుకిలా?
జిబిన్ అనే వ్యక్తి ఫొటోగ్రాఫర్. అతని భార్య చింజు ఇటీవలే ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో ఇరు కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయి. అయితే భార్య ప్రెగ్నెన్సీ ఫొటో షూట్‌ను భిన్నంగా ప్లాన్ చేయాలనుకున్నాడు జిబిన్. అందుకే ఇంట్లోని మహిళలంతా గర్భం దాల్చినట్లు ఫొటోలు తీద్దామని, ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని భార్యకు చెప్పాడు. ఈ ఆలోచన నచ్చి ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. దీంతో అందరూ కలిసి ఈ ఫొటోషూట్ నిర్వహించారు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడంతో ఆనందపడ్డారు.
చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..!
Comments
Please login to add a commentAdd a comment