Watch: Bride And Groom Fall On Stage During Wedding Photoshoot, Video Goes Viral - Sakshi
Sakshi News home page

అయిపాయె: ఏదో చేద్దామనుకుంటే.. ఏదో జరిగింది.. వీడియో వైరల్‌

Published Wed, Dec 28 2022 6:38 PM | Last Updated on Fri, Dec 30 2022 3:15 PM

Bride And Groom Fall On Stage During Wedding Photoshoot Viral Video - Sakshi

మన దేశంలో పెళ్లి కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పెళ్లి ఫిక్స్‌ అవగానే వధవరులిద్దరూ ఫొటో షూట్స్‌, ఫొటోలకు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఫొటోలకు ఫోజులు ఇచ్చే సందర్బగా జరిగిన తప్పిదాల కారణంగా నవ్వు తెప్పించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో వధువు, వరుడు ఇద్దరు ఎదురుగా ఉన్న ఫొటోగ్రాఫర్‌కు స్టిల్స్‌ ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్‌ వినూత్నంగా ఫొటోలు తీసే క్రమంలో వారితో కొత్త స్టిల్స్‌కు ప్లాన్‌ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఒక్కనొకరు హత్తుకునే క్రమంలో వరుడు బ్యాలెన్స్‌ కోల్పోయి వధువుపై పడిపోతాడు. 

ఫొటోలు దిగుతున్న క్రమంలో వధువు.. కిందపడిపోతుంది. అప్పటి వరకు నవ్వుతూ గింగిరాలు తిరిగిన జంట.. ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో, కిందపడిన వధువు షాక్‌కు గురైంది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్‌ సారీ.. సారీ.. అంటూ కామెంట్స్‌ చేయడం వినిపిస్తుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement