Hardik Pandya To Remarry Wife Natasa Stankovic On Valentine's Day In Udaipur, Pics Viral - Sakshi
Sakshi News home page

రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా.. ఫొటోలు వైరల్‌

Published Wed, Feb 15 2023 9:17 AM | Last Updated on Wed, Feb 15 2023 9:57 AM

Hardik Pandya Natasa Stankovic Remarry Udaipur Pics Video Goes Viral - Sakshi

Hardik Pandya- Natasa Stankovic Marriage: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను రెండోసారి వివాహమడాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమికుల దినోత్సవాన(ఫిబ్రవరి 14) హార్దిక్‌- నటాషాలు తమ కుమారుడు అగస్త్య, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా 2020 జనవరి 1న నటాషా వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా.. లాక్‌డౌన్‌లో సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లాడాడు.


వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌ ఇచ్చాడు హార్దిక్‌. ఇక నటాషా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ... తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. మూడేళ్ల క్రితం చేసిన పెళ్లి ప్రమాణాలను మరోసారి గుర్తుచేసుకున్నామని.. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగడం సంతోషంగా ఉందంటూ ఉద్వేగానికి లోనైంది.
చదవండి: Nick Vujicic- Kanae Miyahara: ‘పరిపూర్ణతే’ అర్హతా? వాళ్లది నిజమైన ప్రేమ.. నలుగురు పిల్లలతో ముచ్చటగా..
Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement