బిగ్‌బాస్ బ్యూటీ, స్వామిరారా నటి పూజా రామచంద్రన్ త్వరలోనే తల్లికాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఆమె బేబీ బెంప్‌తో ఫొటోషూట్ ఇచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘సమయం అనేది పరిమితం. కాబట్టి మరొకరి జీవితంలో జీవించడం కోసం వెచ్చించకండి. ప్రతి క్షణాన్ని స్వాధినం చేసుకోండి’ అంటూ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
చదవండి: హౌజ్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా చేశా: నటి పవిత్ర
బీచ్ ఒడ్డున ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో తన భర్త, నటుడు జాన్ కొక్కెన్‌తో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటోల్లో భర్తకు లిప్‌లాక్ ఇస్తూ రొమాంటిక్‌గా ఫొజులు ఇచ్చింది. ప్రస్తుతం పూజా రామచంద్రన్ బేబీ బంప్ ఫొటోలను నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. క్యూట్ కపుల్, మీకు త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలంటూ నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
చదవండి: NTR30 నుంచి క్రేజీ అప్‌డేట్... అలాంటి పాత్రల్లో తారక్!
కాగా లవ్ ఫెయిల్యూర్, స్వామిరారా అడవి కాచిన వెన్నెల వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన పూజా రామచంద్రన్ తన కర్లీ హెయిర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు బిగ్‌బాస్ 2 సీజన్‌లో పాల్గొన్ని మరింత పాపులర్ అయ్యింది. అనంతరం వెంకీ మామ, ఎంత మంచివాడవురా, పవర్ ప్లే వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో 2010లో వీజే క్రెగ్‌ను పెళ్లాడిన పూజా.. 2017లో విడాకులు ఇచ్చేసింది. 2019లో జాన్ కొక్కెన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment