మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్, ఆమె బాయ్ ఫ్రెండ్ కశ్మీరి మోడల్ రోహ్మాన్ షాల్‌లు బ్రేకప్ చెప్పుకున్నారంటు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాక సుస్మిత వరుస పోస్టులు కూడా ఇది నిజమే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ఆసక్తికరంగా రోహ్మాన్ ఇన్‌స్టా స్టోరీలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమించాయి. ఇవి చూస్తుంటే నిజంగానే వారి మధ్య ఎదో జరిగినట్లుగా అనిపిస్తుంది. దీంతో వీరి ప్రేమాయణం, బ్రేకప్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కాగా కొన్నేళ్లుగా సుస్మిత, రోహ్మాన్ లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం రోహ‍్మాన్ ఇన్‌స్టాలో ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అంతేగాక సుస్మిత సేన్ గురించి కూడా అడగ్గా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యాడు. ఈ క్రమంలో సెలబ్రెటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారాని, దీని వల్ల స్వేచ్చగా రోడ్డుపైకి రాలేకపోతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారని ఓ అభిమాని అడగ్గా.. ‘నిజం చెప్పాలంటే నేను ఇంకా స్వయంగా సెలబ్రేటీ హోదా రాలేదు. అది వేరేవాళ్ల కృషి వల్ల వచ్చింది(సుస్మితను ఉద్దేశించు చెప్పినట్లుగా ఉంది).
కానీ ఒకరోజు నేను ఆ స్థాయికి తప్పకుండా చేరుకుంటాను. ఆ రోజున మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను మై ఫ్రెండ్’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే సుస్మిత సేన్ గురించి ఏదైన చెప్పమని కోరగా.. ఆమె చాలా ఉత్తమైనది అని తెలిపాడు. అంతేగాక తనలో ఆయనను ఆకర్షించేందని అడగ్గా.. తన అవగాహన అంటు సమాధానాలు ఇచ్చాడు. కాగా రోహ్మాన్ తదుపరిగా ఆర్య వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌లో నటిస్తున్నాడు. మొదటి సీజన్‌లో సుస్మిత లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే సుస్మిత ఇవాళ తాను 45 ఏళ్ల వయసులో కూడా తన ఎంపికలో పొరపాట్లు చేశానంటు ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రోహ్మాన్ తన లైవ్ సెషన్ స్టోరీనీ పంచుకోవడం గమనార్హం.
చదవండి:
సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి
45 ఏళ్ల వయసులో కూడా ఎంపికలో పొరపాటు చేశాను: సుస్మిత సేన్
Comments
Please login to add a commentAdd a comment