
హీరోయిన్ కీర్తి సురేష్ ఈమధ్య కాలంలో పెళ్లి వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కీర్తి ఓ అబ్బాయితో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు రీసెంట్‌గా కీర్తి ఓ అబ్బాయితో క్లోజ్‌గా ఫోటోలు దిగడం, ఇద్దరూ సేమ్ కలర్ అవుట్‌ఫిట్‌లో దర్శనం ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
సోషల్ మీడియాలోనూ కీర్తి ప్రేమ విషయం వైరల్‌గా మారడంతో స్వయంగా ఆమె స్పందించక తప్పలేదు. తను జస్ట్ ఫ్రెండ్ అని, ఈ వార్తల్లో అతన్ని లాగకండి అంటూ పేర్కొంది. అంతేకాకుండా తన లైఫ్‌లోని నిజమైన మిస్టరీ మ్యాన్‌ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తానంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తిసురేష్ తండ్రి కూడా ఈ వార్తలపై స్పందించారు.
'నా కూతురు ప్రేమలో ఉందని,అతనితో త్వరలోనే పెళ్లి అంటూ కథనాలు రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు. రీసెంట్‌తో కీర్తి షేర్ చేసిన ఫోటోల్లోని అబ్బాయి నాకు తెలుసు. అతను ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. కీర్తి పెళ్లి ఫిక్స్ అయితే తప్పకుండా మీడియాకు తెలియజేస్తాము. అంతేకానీ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల కుటుంబంలో మనఃశాంతి కరువవుతుంది' అంటూ ఆవేదన వ్యక్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment