ప్రియుడితో కుమార్తె పరార్‌.. తల్లిదండ్రుల ఆత్మహత్య | Daughter Jump with Boyfriend, Parents Commits Suicide at Annanagar | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కుమార్తె పరార్‌.. తల్లిదండ్రుల ఆత్మహత్య 

Published Sun, Nov 20 2022 3:40 PM | Last Updated on Sun, Nov 20 2022 3:40 PM

Daughter Jump with Boyfriend, Parents Commits Suicide at Annanagar - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై(అన్నానగర్‌): కడలూర్‌ సమీపంలో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ప్రియుడితో కుమార్తె వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కడలూరు సమీపం పుదుచత్రం సమీపంలోని వేలంగిపట్ట గ్రామానికి చెందిన సుందరమూర్తి (65) రైతు. ఇతని భార్య సుమతి (50). వీరి కుమార్తె పుష్పరోహిణి(19). సి.ముడ్లూరు ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమెకి పెరియాండికులి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించగా ఆదివారం (ఈరోజు) నిశ్చితార్థం జరగాల్సి ఉంది.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాల వారు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పుష్పరోహిణి కాలేజీకి వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. కాలేజీ ముగించుకుని ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పుష్పరోహిణి కోసం పలు ప్రాంతాల్లో వెతికారు. అప్పుడు పుష్పరోహిణి వేలంగిపట్టు గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందని, ప్రియుడితో వెళ్లిపోయిందని తేలింది. ఈ విషయం తెలుసుకున్న సుందరమూర్తి, సుమతి తీవ్ర ఆవేదనకు గురై.. పొలం వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (గుంటూరు బ్యూటీషియన్‌ హత్యకేసు.. వివాహేతర సంబంధమే కారణమా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement