parents suicide
-
ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య
సాక్షి, చెన్నై(అన్నానగర్): కడలూర్ సమీపంలో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ప్రియుడితో కుమార్తె వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కడలూరు సమీపం పుదుచత్రం సమీపంలోని వేలంగిపట్ట గ్రామానికి చెందిన సుందరమూర్తి (65) రైతు. ఇతని భార్య సుమతి (50). వీరి కుమార్తె పుష్పరోహిణి(19). సి.ముడ్లూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమెకి పెరియాండికులి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించగా ఆదివారం (ఈరోజు) నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాల వారు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పుష్పరోహిణి కాలేజీకి వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. కాలేజీ ముగించుకుని ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పుష్పరోహిణి కోసం పలు ప్రాంతాల్లో వెతికారు. అప్పుడు పుష్పరోహిణి వేలంగిపట్టు గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందని, ప్రియుడితో వెళ్లిపోయిందని తేలింది. ఈ విషయం తెలుసుకున్న సుందరమూర్తి, సుమతి తీవ్ర ఆవేదనకు గురై.. పొలం వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గుంటూరు బ్యూటీషియన్ హత్యకేసు.. వివాహేతర సంబంధమే కారణమా?) -
కొడుకు పెళ్లి జరగదని తెలిసి.. తల్లిదండ్రుల ఆత్మహత్య
టీ.నగర్: వియ్యంకులు తిట్టారని మనస్తాపానికి గురై దంపతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. సేలం జిల్లా, ఇలంపిళ్లై సమీపంలోగల పులియంపట్టికి చెందినతంగమణి (59), రత్నం దంపతులు. వీరికి రాజా అన్నామలై అనే కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాజా అన్నామలై ఎంబీఏ చదివి చెన్నై ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఎ.పుదూరు ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో రాజా అన్నామలై ఆ యువతితో తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతుండడంతో గొడవ ఏర్పడింది. దీంతో యువతి తల్లిదండ్రులు గురువారం రాజా అన్నామలై ఇంటికి వచ్చారు. అక్కడ మీ కుమారుడిని మందలించండి అంటూ తంగమణిని, భార్య రత్నంను బెదిరించి వివాహం జరగదని చెప్పి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన తంగమణి, రత్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సేలంలో గురువారం పాయిజన్ ఇంజక్షన్ వేసుకుని ధర్మపురి జిల్లా, పనికారన్‌కొట్టాయ్ ప్రాంతానికి చెందిన మణికంఠన్‌కుమార్తె పవిత్ర (21). ఈమె సేలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు. ఈమె గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: అతడిని నిర్లక్ష్యం చేయడంతో ఆమెపై పగ -
పాపం.. పసివాళ్లు
కూడేరు: ఆ తల్లిదండ్రుల మనస్పర్థలు ఇద్దరు చిన్నారులను అనాథలను చేశాయి. క్షణికావేశంతో వారు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలిద్దరూ దిక్కులేనివారయ్యారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు.. తల్లిదండ్రుల మృతదేహాలపై పడి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కొర్రకోడు డ్యామ్‌కు చెందిన ఈడిగ వాసు(30), నాగతేజ శ్వణి(27) ప్రేమించుకుని 2012లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వాసు పీఏబీఆర్ డ్యామ్ వద్ద ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆరేళ్ల కుమారుడు జయవర్ధన్, నాలుగేళ్ల కుమార్తె మోక్షిత ఉన్నారు. శనివారం రాత్రి వాసు, నాగతేజశ్వణిలు భోంచేసి నిద్రించేందుకు వెళ్లారు. వాసు తల్లిదండ్రులు మరో ఇంట్లో నిద్రించారు. ఉదయం ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఉరేసుకుని కనిపించారు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. -
వి‘రక్త’ బంధాలు
సాక్షి, నర్సంపేట(వరంగల్) : మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మానవత్వం మచ్చుకైనా కనిపిస్తలేదు.. ఇది ఓ పాటలోని వాక్యం కాదు .. నిజ జీవితంలో ఎక్కడో చోట బయటపడుతున్న వాస్తవం . అయినవాళ్లు.. చివరకు అమ్మానాన్నల బంధాలకు సైతం బీటలు వారుతున్నాయి. డబ్బే పరమావధిగా అరాచకాలు చోటు చేసుకుంటున్నా యి. కన్న తల్లిదండ్రులను కొడుకు చంపడం.. కొడుకును తల్లిదండ్రులే చంపడం.. ఆస్తికోసం అమ్మానాన్నలను గెంటివేయడం.. సోదరులపై దాడి, హత్య చేయడం జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న అమానవీయ ఘటనలే ఇందుకు నిదర్శనం. ప్రాధేయపడినా కనికరించని కసాయి.. గత నెల 30వ తేదీన అన్న కంటే తక్కువ భూమి పంచి ఇచ్చారని వృద్ధ తల్లిదండ్రులపై మమకారాన్ని మరిచిన కన్న కొడుకు, మనుమడు కలిసి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చిన ఘటన రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాలో ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. భూక్యా దస్రూ – బాజీని గొంతు కోసి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. తండ్రిని చంపిన అనంతరం తల్లిని చంపబోతుండగా వద్దని ప్రాధేయపడినా కొడుకు తల్లిని సైతం చంపడం బంధాలు రోజురోజుకు దిగజారాయని చెప్పడానికి ఉదాహరణగా చెప్పొచ్చు. కొడుకు, కోడలు వేధింపులతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య(76), రాళ్ల బండి రాధమ్మ(66) వృద్ధ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నారు. వీరిని తరచూ కొడుకు , కోడలు వేధించే వారని స్థానికులు తెలిపారు. కొడుకుకు భారం కాకుడదని ముహూర్తం పెట్టుకుని వారి దహన సంస్కారాలకు సైతం డబ్బులు సమకూర్చుకుని మరీ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆరెకరాలు సంపాదించి ఇచ్చినా నిత్యం కొడుకు, కోడలు సూటిపోటి మాటలే వారి ఆత్మహత్యకు కారణమైందని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో కడారి మహేష్‌చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబసభ్యులు కిరోసిన్ పోసి మంగళవారం సజీవ దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కున చేర్చుకునేవారు లేరు.. రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అనుమాండ్ల వీరస్వామి– శోభలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పిల్లు లేరు. వయస్సు మీద పడడంతో వీరస్వామికి ఆరోగ్యం బాగా లేదు. దీంతో వీరస్వామి దంపతులకు ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వలేదు. శోభ ఇండ్లలో పనిచేస్తూ ఎంతో కొంత వచ్చిన డబ్బులతో వారు పెట్టిన అన్నం తెచ్చి భర్తకు పెట్టి తాను తిని దయనీయ స్థితిలో జీవనం సాగించారు. గత మూడు నెలలుగా చెట్ల కిందనే దయనీయ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా జిల్లాలో అనుబంధాలు.. బంధాలు అన్నది మరిచిపోయిన ఘటనలు ఇటీవల కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. బంధాలు దూరమవుతున్నాయి.. తల్లిదండ్రులు పిల్లల మధ్య రోజురోజుకు దూరం పెరుగుతుంది. పక్కవాళ్లను చూసి మంచి కన్నా చెడే ఎక్కువ నేర్చుకోవడం, మంచి కన్నా చెడు ఎక్కువగా నేర్చుకోవడం ఎక్కువైపోయింది. మానసిక బంధాలను ప్రేమను పెంచుకుంటే తప్పా ఒకరి బాధలను ఇంకొకరికి అర్థమయ్యేలా పిల్లలకు, పిల్లల బాధలను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటేనే ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలను ఆపడానికి అవకాశం ఉంది. – సృజనారెడ్డి, సైకలాజిస్ట్ -
మేం మేం చేశాం నేరం
సాక్షి, సిద్దిపేట : ‘ శ్రావణ్‌ది తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లి గ్రామం. ప్రస్తుతం మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఐదేళ్ల క్రితం శ్రావణ్ తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీశైలం ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయం చేద్దామని అందినకాడికి అప్పులు చేసి బోరు బావులు తవ్వించారు. బోరు బావుల్లో చుక్క నీరు పడక పోవడంతో వ్యవసాయం సన్నగిల్లింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో 2014లో శ్రావణ్ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో తల్లిదండ్రుల సంరక్షణలో పెరగాల్సిన శ్రావణ్ అనాథగా మారాడు. చేరదీయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్రావణ్ సంరక్షణ భారం నానమ్మ సత్తవ్వ భుజస్కంధాలపై పడింది. సత్తవ్వకు వచ్చే ఆసరా పింఛన్‌తో శ్రావణ్‌ను పోషించుకుంటోంది. ఆసరా పింఛన్ డబ్బులు సత్తవ్వ మందులకే సరిపోవడంతో శ్రావణ్ చదువులకు ఆటంకం ఏర్పడింది. దీంతో గ్రామంలోని కొందరు యువకుల సహకారంతో మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించి చదివిస్తుంది.’ ‘నిజాంపేట మండల కేంద్రానికి చెందిన జాల మల్లేశం బతుకుదెరువు నిమిత్తం సౌదీ వెళ్లి గత ఏడాది అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ సరిగా వేతనం లభించకపోవడం, స్వగ్రామంలో అప్పులబాధ వెరసి అతడు సౌదీలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లక్ష్మితో పాటు 14 ఏళ్లలోపు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక వైపు భర్త దేశంకాని దేశంలో ఆత్మహత్య చేసుకోగా.. ముగ్గురు పిల్లలతో లక్ష్మి బతుకు బండిని ఈడుస్తూ క్షణమొక యుగంగా గడుపుతోంది. ఏ పాపం ఎరుగని పిల్లలు తండ్రిప్రేమకు దూరమయ్యారని, కన్నీరు మున్నీరు అవుతుంది.’ ఇలా లక్ష్మి, శ్రావణ్, మరో చోట పల్లవి, కల్యాణ్ వంటి పసిపిల్లలు ఏపాపం ఎరుగకుండానే అనాథలుగా జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పుతో సాటి పిల్లలు అమ్మానాన్నలతో సంతోషంగా ఉంటే వీరు మాత్రం అమ్మానాన్నలను కోల్పోయి ముసలి తాత, అమ్మలకు భారంగా ఉన్నారు. కుటుంబ కలహాలు, అనుమానాలు, వరకట్నం, అత్యాచారాలు, ఆఘాయిత్యాలతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే మరికొందరిని పురిటిలోనే చెత్తకుప్పల పాలు చేసిన అమ్మలు ఉండటం గమనార్హం. అయితే వీరిలో కొందరిని అమ్మానాన్నలు, బంధువులు చేరదీయగా, మరికొందరు వీధిబాలలుగా, నేరస్తులుగా, దోపిడి దొంగలుగా మారుతున్నవారు ఉన్నారు. సమాజంపై కసిని పెంచుకొని రాక్షసులుగా మారినవారు కూడా లేకపోలేదు. 16 నెలల్లో 687 స్త్రీ, పురుషుల ఆత్మహత్యలు.. గడిచిన 16 నెలల్లోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో 687 మంది స్త్రీ, పురుషులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. వీరిలో తల్లిదండ్రులు, తమ పిల్లలకు కూడా విషమిచ్చి వారు విషం తీసుకొని మరణించిన వారు ఉండగా.. మరికొందరు తాము చనిపోయి పిల్లలను అనా«థలుగా చేసిన వారు ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 729 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 522 మంది పురుషులు ఉన్నారు. వీరిలో దుబాయ్, మస్కట్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. అదే విధంగా కరువు జిల్లా కావడంతో కాలం కలిసి రాక వ్యవసాయంలో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. మరికొందరు చిన్న చిన్న సంఘటనలకు మనోవేదనకు గురై నిండుప్రాణం నిలువునా తీసుకున్నవారు లేకపోలేదు. అదేవిధంగా 165 మంది మహిళలు ఉన్నారు. వీరు కూడా భార్య భర్తల మద్య మనస్పర్థలు, అత్తా మామలు, ఇతర గొడవలు, వరకట్నం వేదింపులకు తాళలేక ఒక చోట ఫ్యాన్‌కు ఉరివేసుకొని, మరొక చోట క్రిమిసంహారక మందు తాగి, ఇంకొక చోట కిరోసిన్, పెట్రోల్‌తో తగుల బెట్టుకొని మరణించిన వారు ఉన్నారు. అయితే ఈ 687 మందిలో దాదాపుగా 90 శాతం మంది వివాహితులు కావడం, వారికి చిన్న చిన్న పిల్లలు ఉండటం గమనార్హం. తనువు చాలించే సమయంలో పసికూనల భవిష్యత్ ఆలోచించి ఉంటే వారు బతికుండేవారని, అనేవారు కొందరైతే ఏ పాపం ఎరుగని పసిపిల్లల బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసి వెళ్లిపోయారని అనేవారు కొందరు ఉన్నారు. ఎవ్వరేమన్నా.. అనా«థలుగా మారిన బాల్యం మాత్రం అనునిత్యం మనోవేదనకు గురవుతూనే ఉన్నారు. బాల్యానికి భరోసా ఏదీ? పిల్లలను వేధించడం నేరం అని తల్లిదండ్రులకు కూడా శిక్షలు వేసే దేశాలు ఉన్నాయి. బాల్యం విలువైనది, వారి హక్కులను హరించే అధికారం ఎవరికి లేదని మన దేశంలో కూడా ఎన్నో హక్కులు వచ్చినా.. తల్లిదండ్రుల క్షణికావేశం, ఇతర కారణాలతో పిల్లలను వదిలేయడం, బాల్య వివాహాలు చేసి వారి భవితను అంధకారం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు బాలుర రక్షణ, సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా మాతా, శిశుసంక్షరణ, పోలీస్ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1651 మందిని గుర్తించారు. ఎవరూ లేక భిక్షాటన చేసేవారు, అనాధలు, బడిమానేసిన వారు, బాలకార్మికులుగా జీవనం సాగించేవారు ఉండటం గమనార్హం. కౌన్సెలింగ్ అవసరం.. ఆత్మహత్యలు క్షణికావేశంలో చేసే పని. మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతారు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు జీవితాంతం వేదన చెందాల్సి ఉంటుంది. మానసికంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉండటం. చిన్న చిన్న విషయాల్లో భయాందోళన చెందిన వారిని గుర్తించాలి. వారి కుటుంబ సభ్యులు వెంటనే మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించాలి. చిన్నతనం నుంచే సమాజిక పరిస్థితులపై అవగాహన కల్పించాలి. – డాక్టర్ అనూష, మానసిక వైద్యురాలు, సిద్దిపేట రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు జిల్లా బాలురు బాలికలు మొత్తం సిద్దిపేట 333 85 468 సంగారెడ్డి 206 411 617 మెదక్ 258 358 566 మొత్తం 797 854 1651 -
వివాహితతో కుమారుడు పరారు.. పరువు తీశాడని..
దొడ్డబళ్లాపురం : కుమారుడు పక్కింటి వివాహితతో పరారవడంతో అవమానం భరించలేని తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనకపుర తాలూకా కల్లిగౌడన దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసులయిన సిద్ధరాజు (52) సాకమ్మ( 42) ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతులు. వీరి కుమారుడు మను ఇదే గ్రామానికి చెందిన ఓ వివాహితను తీసుకుని బుధవారం పరారయ్యాడు. కుమారుడి చర్యలతో గ్రామస్తులు తల్లితండ్రులను నిందిండంతో పాటు ఇంటి ముం దుకువచ్చి వివాహిత కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన వారు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కోడిహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. ఓ కుటుంబం విషాదాంతం
-
వైద్యుల నిర్లక్ష్యం.. ఓ కుటుంబం విషాదాంతం
న్యూఢిల్లీ: అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు డెంగ్యూ వ్యాధి బారినపడ్డాడు. ఈ ఏడేళ్ల చిన్నారిని చికిత్స కోసం తీసుకెళితే చేర్చుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు నిరాకరించాయి. కొడుకును కాపాడుకునేందుకు ఏమీ చేయలేని దయనీయ స్థితి. చికిత్స అందక ఆ చిన్నారి మరణించాడు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో ఆశలతో ఒడిశా నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ కుటుంబం.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల విషాదాంతమైంది. ఈ ఘటనను కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాయి. వైద్యం చేయడానికి నిరాకరించిన రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు ఢిల్లీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. వీటిపై తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులను ఒడిశాకు చెందిన లక్ష్మీచంద్ర, బబితా రౌత్‌గా గుర్తించారు. లక్ష్మీచంద్ర ఓ ప్రైవట్ కంపెనీలో పనిచేసేవారు. ఈ కుటుంబం లడో సరాయ్ వద్ద నివాసం ఉండేది. ఈ దంపతుల కొడుకు అవినాష్ (7)కు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఈ నెల 7న ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ చిన్నారిని చేర్చుకునేందుకు రెండు ఆస్పత్రుల్లో నిరాకరించారు. చివరకు మరో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆలస్యం కావడంతో మరుసటి రోజున అంటే 8వ తేదీని అవినాష్ డెంగ్యూతో మరణించాడు. కుమారుడి మృతిని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని వారు ఒడియాలో సూసైడ్ నోట్ రాసిపెట్టారు. అయితే ఈ కుటుంబం బలి కావడానికి ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి.