![Son Illegal Affair Parents Suicide In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/14/suicide.jpg.webp?itok=iT07Ulza)
ఆత్మహత్యకు పాల్పడ్డ సిద్ధరాజు, సాకమ్మ
దొడ్డబళ్లాపురం : కుమారుడు పక్కింటి వివాహితతో పరారవడంతో అవమానం భరించలేని తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనకపుర తాలూకా కల్లిగౌడన దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసులయిన సిద్ధరాజు (52) సాకమ్మ( 42) ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతులు. వీరి కుమారుడు మను ఇదే గ్రామానికి చెందిన ఓ వివాహితను తీసుకుని బుధవారం పరారయ్యాడు.
కుమారుడి చర్యలతో గ్రామస్తులు తల్లితండ్రులను నిందిండంతో పాటు ఇంటి ముం దుకువచ్చి వివాహిత కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన వారు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కోడిహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment