![Husband killed wife Dowry Harassment in Doddaballapur - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/23/dod.jpg.webp?itok=XuBvXlSF)
శ్రుతి, క్రిష్ణమూర్తి (ఫైల్)
సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. శ్రుతి తల్లిదండ్రులు వివాహ సమయంలో రూ.18 లక్షలు వరకట్నం ఇచ్చి అట్టహాసంగా పెళ్లి జరిపించారు.
అయితే వివాహం జరిగిన మూడు నెలలు మంచిగానే ఉన్న క్రిష్ణమూర్తి తరువాత అసలు రంగు బయటపెట్టాడు. మరింత వరకట్నం తీసుకురావాలని శ్రుతిని వేధించసాగాడు. క్రిష్ణమూర్తికి అతడి తల్లి లక్ష్మమ్మ, తండ్రి బైలప్ప ఇద్దరూ వంతపాడేవారు. ఈక్రమంలో సోమవారం రాత్రి కట్నం విషయంలో భార్యతో గొడవపడ్డ క్రిష్ణమూర్తి కత్తితో శ్రుతిని దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి)
Comments
Please login to add a commentAdd a comment