Shruti Haasan's Boyfriend Santanu Hazarika Says 'We Are Already Married', Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

Shruti Haasan: నాకు శ్రుతీహాసన్‌తో అలా పెళ్లయిపోయింది

Published Thu, Mar 24 2022 6:55 AM | Last Updated on Thu, Mar 24 2022 10:41 AM

Shruti Haasans Boyfriend: We are already Married - Sakshi

శ్రుతీహాసన్, శంతను హజారికా

శ్రుతీహాసన్‌తో తన వివాహం జరిగిపోయిందంటున్నారు చిత్రకారుడు, ర్యాపర్‌ శంతను హజారికా. అయితే ఆయన మాటల్లో ఓ ట్విస్ట్‌ ఉంది. అదేంటంటే.. శ్రుతీతో తన వివాహం క్రియేటివ్‌గా అయ్యిందని చెబుతున్నారు. ఈ విషయం గురించి ఓ ఇంగ్లీష్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంతను మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్‌గా మా (శ్రుతి, శంతను) పెళ్లి జరిగిపోయింది. అందుకు ఓ నిదర్శనం మా బలమైన బంధం. మేమిద్దరం క్రియేటివ్‌ పీపుల్‌. ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్‌ చేయాలనుకుంటాం.

నా జీవితంలో శ్రుతీ ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే నన్ను చూసి తను ఇన్‌స్పైర్‌ అవుతుంటుంది. మా క్రియేటివ్‌ (సృజనాత్మకత) థాట్స్‌ కూడా ఒకేలా ఉంటాయి. ఇక ప్రత్యక్షంగా మా వివాహం ఎప్పుడు జరుగుతుంది? అనే విషయంపై మాత్రం నాకు క్లారిటీ లేదు’’ అన్నారు.  క్రియేటివ్‌గా పెళ్లయిందంటే.. మానసికంగా తమ బంధం ముడిపడిందని శంతను చెబుతున్నారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల ‘కపుల్‌ గోల్స్‌ చాలెంజ్‌’లో శంతను, శ్రుతి పాల్గొన్న విషయం గుర్తుండే ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement