ప్రస్తుత సౌత్ టాప్ హీరోయిన్లతో మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ ఒకరు. తెలుగులో నేరుగా మూవీ చేయకపోయిన హీరో విజయ్ ‘మాస్టర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ప్రస్తుతం తమిళ, కన్నడలో వరస ప్రాజెక్ట్స్‌తో మాళవిక ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఇటీవల మాల్దివులు టూర్ వెళ్లోచ్చిన మాళవిక ఇన్‌స్టాలో లైవ్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇక తాజాగా ఓ వీడియో షేర్ చేసిన మాళవిక.. తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది. ఇందులో మాళశిక మేల్ షర్ట్, షేవింగ్ కిట్‌ను వాలైంటైన్ డే గిఫ్ట్‌కు సిద్ధం చేస్తూ కనిపించింది.
చదవండి: వెనక్కి తగ్గిన సరయూ, కాసేపట్లో పోలీస్ స్టేషన్‌కు పిటిషనర్..
అదేంటని అడగ్గా ఓ కంపెనీ వాలంటైన్స్ డే సందర్భంగా తనకు ఈ బహుమతులు పంపించినట్టు చెప్పింది. అయితే ఇది మేల్ షేవింగ్ కిట్ కదా.. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అని అడిగిన ప్రశ్నకు ఆమె అవును ఉన్నాడు అని సమాధానం ఇచ్చింది. అతనేవరో చెప్పాలని పట్టుబట్టడంతో.. ‘బాయ్ ఫ్రెండ్ ఎవరో ఖచ్చితంగా చెప్తాను. ప్రామిస్. కానీ ఈ వీడియోకు 1 మిలియన్ వ్యూస్ వస్తనే’ అంటూ కండిషన్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి మళవిక బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలియాలంటే ఈ వీడియోకు మిలియన్ వ్యూస్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
చదవండి: ఆర్జీవీ ట్వీట్, పెద్దవాళ్లపై వర్మ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment