బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన శ్రుతిహాసన్‌ | Shruti Haasan About Her Boyfriend Santanu Hazarika | Sakshi
Sakshi News home page

Shruti Haasan : .శంతను వల్ల నేను అలా మారిపోయాను.. కలిసే ఉంటాం'

Published Tue, Dec 27 2022 9:54 AM | Last Updated on Tue, Dec 27 2022 9:58 AM

Shruti Haasan About Her Boyfriend Santanu Hazarika - Sakshi

డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతనుతో తాను రిలేషన్‌లో ఉన్న విషయాన్ని శ్రుతీహాసన్‌ ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచలేదు. సోషల్‌ మీడియాలో అతనితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ, కామెంట్లు పెడుతుంటారీ బ్యూటీ. తాజాగా శంతను వల్ల తనలో వచ్చిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నేను, శంతను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరం కలిసి ఉంటాం. ఇద్దరం కలిసి కామెంట్లు చదువుతుంటాం. ఎందుకంటే ఆ కామెంట్స్‌ కామెడీగా ఉంటాయి.

ఇక తన వల్ల నేను ప్రశాంతంగా మారిపోయాను. అలాగే దయగల వ్యక్తిగా వరాను. శంతను చాలా ప్రశాంతంగా, దయగా ఉంటాడు. అందుకే తనంటే నాకు ఇష్టం. ఈ రెండు లక్షణాలను నేను అలవాటు చేసుకున్నాను’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు శ్రుతీహాసన్‌. ఇక సినివల విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ఈ సంక్రాంతికి థియేటర్లలో కనిపించనున్నారు శ్రుతీహాసన్‌. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘సలార్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement