
Rakul Preet Singh Dance Video Goes Viral Jackky Bhagnani Comment: అతికొద్ది సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన ఈ పంజాబీ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'రన్ వే 24', 'ఎటాక్' చిత్రాలతో బీటౌన్ ఆడియెన్స్‌ను పలకరించింది. ప్రస్తుతం రకుల్ చేతిలో థ్యాంక్ గాడ్, ఛత్రీవాలి, డాక్టర్ జీ, ఓ మై గోస్ట్, మిషన్ సిండ్రెల్లా, 31 అక్టోబర్ లేడీస్ నైట్ తదితర చిత్రాలు ఉన్నాయి. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది రకుల్. తాజాగా తన డ్యాన్స్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ కాగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తాజాగా సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇందులో భాగంగానే 'పసూరి' (Pasoori) పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ఈ సాంగ్ తన ఫేవరెట్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు కొడుతూ గంటలోనే సుమారు 3 లక్షలకుపైగా వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన సెలబ్రిటీలు ఓ మై గాడ్, చంపేశావ్ బేబీ అని కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. ఇక రకుల్ బాయ్‌ఫ్రెండ్, యాక్టర్ జాకీ భగ్నానీ డియర్ లవ్.. నాకు కూడా నేర్పించవా అని కామెంట్ చేశాడు. కాగా రకుల్ డ్యాన్స్ చేసిన 'పసూరి' సాంగ్ యూట్యూబ్‌లో 20 కోట్లకు పైగా వ్యూస్ సొంత చేసుకుని సెన్సేషనల్‌గా మారిన విషయం తెలిసిందే.
చదవండి: జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment