బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నటి స్టెప్పులు | Ankita Lokhande And Boy friend Vicky Jain Dance Video | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నటి స్టెప్పులు

Published Tue, Nov 24 2020 12:25 PM | Last Updated on Tue, Nov 24 2020 1:33 PM

Ankita Lokhande And ​Her Boyfriend Vicky Jain Dance Video - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే తరచు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఆమె తాజాగా తన బాయ్‌ ఫ్రెండ్‌ విక్కిజైన్‌తో కలిసి డాన్స్‌ చేసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘నేను, విక్కి కలిసి డాన్స్‌ చేస్తున్నాము’ అని ఆమె కాప్షన్‌ జతచేశారు. ఆ వీడియోలో ఇద్దరూ తెల్లని దుస్తులు ధరించి నృత్యం చేశారు. 2014లో విడుదలైన హృతిక్‌ రోషన్‌ ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ సినిమాలోని ఓ పాటకు ఇద్దరూ హుషారుగా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఆమె షేర్‌ చేసిన డాన్స్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని ఉద్దేశించి అంకిత భావోద్వేగం

ఇటీవల ఈ జంట దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా అంకిత సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. హిందిలో ప్రజాధారణ పొందిన టీవీ షో ‘పవిత్ర రిష్ట’ ద్వారా అంకిత పాపులర్‌ అయ్యారు. దీంతో పాటు ఏక్ థి నాయక, శక్తి-అస్తిత్వా కే ఎహ్సాస్ కి వంటి షోల్లో ఆమె నటించారు. గత ఏడాది కంగానా రనౌత్ లీడ్ ‌రోల్‌లో తెరకెక్కిన ‘మణికర్ణిక’ మూవీ ద్వారా అంకిత బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ బాగీ-3 నటి  జలక్ దిఖ్‌లాజా, కామెడీ సర్కస్‌ వంటి ప్రముఖ రియాలటీ షోలలో కూడా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement