Shraddha Kapoor Spotted With Rumored Boyfriend Rahul Mody - Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో థియేటర్‌కు శ్రద్ధా కపూర్.. వీడియో వైరల్!

Published Tue, Jul 4 2023 7:22 PM | Last Updated on Tue, Jul 4 2023 7:57 PM

Shraddha Kapoor spotted with rumored Boyfriend Rahul Mody - Sakshi

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఆషిక్-2 సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ తర్వాత పలు చిత్రాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ ఏడాది రణ్‌బీర్ కపూర్ సరసన తూ జూటి మెయిన్ మక్కర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో బాగీ, ఎక్ విలన్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌, స్త్రీ, ఓకే జాను లాంటి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో కనిపించింది శ్రద్ధా కపూర్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది. 

(ఇది చదవండి: హ్యాపీ బర్త్‌ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!)

అయితే తాజాగా ఈ సాహో భామ ముంబయిలో ఓ థియేటర్ వద్ద కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూసి బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కింది. అయితే ఆమెతో పాటు బాయ్‌ఫ్రెండ్ రాహుల్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి థియేటర్‌లో సినిమా చూసి వెళ్తుండగా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బీ టౌన్‌లో చర్చ మొదలైంది. కానీ ఇంతవరకు వీరి రిలేషన్‌పై ఎక్కడా స్పందించలేదు. అయితే వీరిద్దరు వేరు వేరు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  

కాగా.. రాహుల్  తూ జూతీ మైన్ మక్కార్ సినిమాకు రచయితగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. అంతే కాకుండా రాహుల్ ప్యార్ కా పంచ్‌నామా- 2, సోను కే టిటు కి స్వీటీతో సహా లవ్ రంజన్ చిత్రాలకు కూడా పనిచేశాడు. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2022లో విడిపోయినట్లు బీ టౌన్‌లో రూమర్స్ వినిపించాయి.

(ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement