దే..వుడా! | janhvi kapoor friend rich boyfriend Breakup | Sakshi
Sakshi News home page

దే..వుడా!

Published Sat, Nov 16 2024 11:43 PM | Last Updated on Sat, Nov 16 2024 11:43 PM

janhvi kapoor friend rich boyfriend Breakup

 జాన్వీ కపూర్‌ స్నేహితురాలికి ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయిందట. ఆ అమ్మాయి శోక సముద్రంలో మునగడం జాన్వీని కదిలించింది. దాంతో తన ఫ్రెండ్‌ బీఎఫ్‌ని ఉడికించాలని.. తను స్విట్జర్లండ్‌లో వింటర్‌ జాకెట్‌తో బ్యాక్‌ నుంచి తీసుకున్న ఓ ఫొటోను తన ఫ్రెండ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందట.. విత్‌ మై బాయ్‌ఫ్రెండ్‌ ఇన్‌ స్విట్జర్లండ్‌ అనే రైటప్‌తో! ఆ పోస్ట్‌ చూసి ‘అబ్బా.. తన ఎక్స్‌కి స్విట్జర్లండ్‌ తీసుకెళ్లే రిచ్‌ బాయ్‌ఫ్రెండ్‌ దొరికాడా!’ అని ఆమె బీఎఫ్‌ కుళ్లుకుంటాడని ఆశపడిందట జాన్వీ! కానీ ఆప్పటికే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇన్‌స్టా అకౌంట్‌ని అన్‌ఫాలో చేసేశాడట. ఆ నిజాన్ని ఆలస్యంగా గ్రహించిన జాన్వీ ‘దే..వుడా!’ అంటూ తల పట్టుకుందట.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement