Actress Dimple Hayathi Upset With Boyfriend Details Leaked - Sakshi
Sakshi News home page

Dimple Hayathi : బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. విషయం లీక్‌ కావడంతో డింపుల్‌ అప్‌సెట్‌

Published Sat, May 27 2023 9:55 AM | Last Updated on Sat, May 27 2023 10:27 AM

Dimple Hayathi Boyfriend Details Leaked - Sakshi

హీరోయిన్‌ డింపుల్‌ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్‌ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంతో డింపుల్‌ చాలా అప్‌సెట్‌ అయినట్లు తెలుస్తుంది. ఆమె బయటకు కూడా రావడానికి ఇష్టపడటం లేదని స్వయంగా డింపుల్‌ లాయర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

అసలే వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న డింపుల్‌ ఇప్పుడు ఈ ఇష్యూతో అనసరంగా తన రిలేషన్‌షిప్‌ విషయం బయటపడిందని ఫీల్‌ అవుతుందట. విక్టర్‌ డేవిడ్‌ అనే వ్యక్తితో డింపుల్‌ కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ఇద్దరూ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. కానీ ఇంతవరకు ఈ విషయం ఎక్కడా బయటపడలేదు. అయితే డీసీపీతో జరిగిన గొడవలో డింపుల్‌ బాయ్‌ఫ్రెండ్‌ గురించి లీక్‌ అయ్యింది.

ఈ విషయంపైనే డింపుల్‌ చాలా అసహనంగా ఉందట. కాగా డింపుల్‌ హయతి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ విక్టర్‌ డేవిడ్‌ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని తెలుస్తుంది. అతను గ్రాఫిక్‌ డిజైనర్‌ అట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి లివింగ్‌ రిలేషన్‌లో ఉంటున్నారు. ఇంతకాలం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా డీసీపీతో తలెత్తిన వివాదంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement