రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ గిల్లి అనే కన్నడ సినిమాతో 2009లో మొదటిసారి వెండితెరపై మెరిసింది. టాలీవుడ్‌లో కెరటం అనే చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత తన టాలెంట్‌తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటిస్తూనే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందే స్థాయికి రకుల్ చేరుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో తన ప్రియుడు బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న గోవాలో వారి వివాహం ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో ఆమె జర్నీని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు వెన్నంటి ఉండి సాయం చేసే వ్యక్తులు మన చుట్టూ లేకుంటే సమస్యలు తలెత్తుతాయని ఆమె తెలిపింది.
'నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి నాకు 25 ఏళ్లు వచ్చే వరకు మా అమ్మ ఎప్పుడూ తోడుగా నిలిచింది. నా కెరియర్ మోడలింగ్‌తోనే ప్రారంభమైంది. అలా నేను మొదట అందుకున్న రెమ్యునరేషన్ రూ.5 వేలు.. అక్కడి నుంచి నేడు ఈ స్థాయికి చేరుకున్నానంటే అందుకు ప్రధాన కారణం నా తల్లిదండ్రులు, సన్నిహితులు మాత్రమే.. నా వెంట వాళ్లు లేకుంటే ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చేది.' అంటూ రకుల్ తెలిపింది. ప్రస్తుతం రకూల్ మేరీ పత్నీ కా రీమేక్, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment