హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లికి రెడీ అయిపోయింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేయబోతుంది. ఫిబ్రవరి 21న ఈకో-ఫ్రెండ్లీ పద్ధతిలో ఈ వేడుక జరగనుంది. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి హడావుడి నడుస్తుండగా.. మరోవైపు పెళ్లికి హాజరవడం కోసం ఇప్పటికే అతిథులు అందరూ గోవాకు చేరుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో రకుల్-ఈమె భర్తకు సంబంధించిన ఆస్తుల వివరాలు చర్చనీయాంశంగా మారిపోయాయి.
(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి)
దిల్లీకి చెందిన రకుల్ ప్రీత్.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు హిందీలో కొన్ని సినిమాలు చేసింది గానీ పెద్దగా పేరు రాలేదు. తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చేసిన తర్వాత రకుల్ ఫేట్ మారిపోయింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతానికి మాత్రం హిందీలో మాత్రమే మూవస్ చేస్తోంది.
కరోనా లాక్ డౌన్ టైంలో బాలీవడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడ్డ రకుల్.. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. 2021 అక్టోబరులో అధికారికంగా ప్రకటించేశారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ చాలాసార్లు కలిసి కనిపిస్తూ వచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. బుధవారం (ఫిబ్రవరి 21) గోవాలో పెళ్లి చేసుకోనున్నారు.
(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న హీరోయిన్ దీపికా పదుకొణె.. పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!)
ఇక రకుల్ ఆస్తుల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు జిమ్స్ ఉన్నాయి. వీటితో పాటు మెర్సిడెజ్ బెంజ్ (రూ.కోటి), రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (రూ.70 లక్షలు), బీఎండబ్ల్యూ 520డీ (రూ.75 లక్షలు), ఆడీ Q3 (రూ.35 లక్షలు), మెర్సిడెజ్ మెబాజ్ జీఎల్ఎస్600 (రూ.2.96 కోట్లు) కార్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ఈమె దగ్గర రూ.49 కోట్లు విలువైన ఆస్తి ఉందట.
మరోవైపు రకుల్ కాబోయే భర్త జాకీ భగ్నానీ ఆస్తుల విషయానికొస్తే.. నిర్మాతగా పలు సినిమాలు చేస్తున్న ఇతడి దగ్గర పోర్స్ కేయన్ని (రూ.1.36 కోట్లు), మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఎస్ (రూ.84 లక్షలు), మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ.2.11 కోట్లు), రేంజ్ రోవల్ వాగ్ (రూ.2.39 కోట్లు) కార్లు ఉన్నాయి. పలు స్థిరాస్తులతో కలిపి ఓవరాల్‌గా ఇతడి దగ్గర రూ.35 కోట్ల విలువైన ఆస్తి ఉందట. ఇలా ఇద్దరి దగ్గర కలిపి రూ.84 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం.
(ఇదీ చదవండి: కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!)
Comments
Please login to add a commentAdd a comment