
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికూతురిగా ముస్తాబైంది. మనసిచ్చినవాడితో మనువాడింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగ్గా జరిగింది. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు.
మూడు రోజుల నుంచే సంబరాలు
ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్‌లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అప్పుడే లీక్ చేసింది
కాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్‌లో బయటపెట్టింది. అప్పటినుంచి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పైనా ఫోకస్ చేసింది. ఇన్నాళ్లకు ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 సినిమా చేస్తోంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్ పండగకు థియేటర్లలో రిలీజ్ కానుంది.
చదవండి: సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. జెన్నిఫర్ లోపెజ్ సినిమాలో అలా!
Comments
Please login to add a commentAdd a comment