రకుల్‌, జాకీ పెళ్లి సందడి : వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్‌ | actress Rakul Preet Singh and Jackky Bhagnani wedding card pics go viral | Sakshi
Sakshi News home page

రకుల్‌, జాకీ పెళ్లి సందడి : వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్‌

Feb 12 2024 4:15 PM | Updated on Feb 12 2024 4:32 PM

actress Rakul Preet Singh and Jackky Bhagnani wedding card pics go viral - Sakshi

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్‌ కార్డ్‌  నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. 

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లిసందడికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌బర్డ్స్‌ తమ రిలేషన్ షిప్‌లో మరో అడుగు వేయబోతున్నట్టు  సోషల్ మీడియా వేదికగా  ప్రకటించారు. తాజగా వీరి పెళ్లికి సంబందించిన వెడ్డింగ్‌ కార్డ్‌  నెట్టింట హాట్‌  టాపిక్‌గా మారింది. 

ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది.  వివాహ సన్నాహాలు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి.  వీరి వెడ్డింగ్‌ స్పెషల్‌గా , చిరకాలం గుర్తుండిపోయేలా  అంగరంగ వైభవంగా జరిపేందుకు రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే  నీలం, తెలుపు రంగుల్లో రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శుభలేఖలో కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలతోపాటు  గోవా అందాలు కనిపించేలా ముద్రించడం  విశేషం. అందమైన సోఫా నీలం , తెలుపురంగుల్లో క్యూట్‌ క్యూట్‌  కుషన్‌లు.. మరో  పూలద్వారం గుండా నీలిరంగు గేటు అందమైన బీచ్‌కి దారి తీస్తూ, రకుల్‌, జాగీ పెళ్లి ముహూర్తం విశేషం ఇందులో కనిపిస్తున్నాయి.   ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నట్టు  వీరి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ కూడా హాట్‌ టాపిక్కే. ఎందుకంటే వీరి ద్దరి ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. అందుకే గోవాను ఎంచుకున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement