సూపర్‌స్టార్ ఫ్యామిలీ వారసుడు రెడీ.. వీడియో వైరల్ | Mahesh Babu Son Gautham Ghattamaneni Latest Workout Video Viral | Sakshi
Sakshi News home page

Gautham Ghattamaneni: తండ్రి కొత్త మూవీ వచ్చేలోపు హీరో అయిపోతాడేమో?

Jun 14 2024 2:21 PM | Updated on Jun 14 2024 2:50 PM

Mahesh Babu Son Gautham Latest Workout Video

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన వారసుడిని రెడీ చేస్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. చిన్నప్పుడు తండ్రి కొడుకులిద్దరూ కలిసి 'వన్ నేనొక్కడినే' మూవీలో నటించారు. ఆ తర్వాత గౌతమ్ మరో మూవీ చేయలేదు. పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాడు. కానీ ఇప్పుడు కొడుకు వీడియో షేర్ చేసిన నమ్రత.. అభిమానులకు హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేశ్.. తక్కువ టైంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీలో రికార్డులు సెట్ చేశాడు. ఆ తర్వాత పలు మూవీస్‍‌తో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు.

(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)

ఇకపోతే మహేశ్ ఎంత ఫిట్‌గా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 50కి దగ్గర పడుతున్నా సరే కుర్రాడిలా మెరిసిపోతుంటాడు. ఇప్పుడు మహేశ్ కొడుకు గౌతమ్ కూడా వర్కౌట్స్ షురూ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని నమ్రత ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. వారసుడు వచ్చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం గౌతమ్ వయసు 17 ఏళ్లు. ఒకవేళ హీరోగా ఎంట్రీ ఇద్దామనుకున్నా సరే మరో నాలుగైదేళ్లు పట్టొచ్చు. అంతలో ఫిజిక్ అంతా సెట్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఇదే జరిగితే మహేశ్-రాజమౌళి మూవీ రిలీజయ్యేలోపు గౌతమ్ తెరంగేట్రం ఉండొచ్చేమో?

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement