మహేశ్‌‌ రూట్‌లోనే గౌతమ్.. అదీ చిన్న వయసులో | Gautham Ghattamaneni Visits Mahesh Babu Foundation Patients | Sakshi
Sakshi News home page

Gautham Ghattamaneni: గౌతమ్ గోల్డెన్ హార్ట్.. పొంగిపోతున్న నమ్రత

Published Tue, Aug 29 2023 8:23 AM | Last Updated on Tue, Aug 29 2023 8:40 AM

Gautham Ghattamaneni Visits Mahesh Babu Foundation Patients - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అయితే సినిమాలు చేస్తాడు. లేదంటే కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటాడు. మహేశ్ పిల్లల్లో సితార సందడి చేస్తూనే ఉంటుంది. గౌతమ్ మాత్రం చాలా సైలెంట్‌. పెద్దగా బయట కనిపించడు. అలాంటిది ఇప్పుడు ఓ పనిచేసి తల్లిదండ్రులు పొంగిపోయేలా చేశాడు. ఈ విషయమై నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెగ ఆనందపడిపోతుంది.

(ఇదీ చదవండి: బర్త్‌డే స్పెషల్.. టాలీవుడ్‌లో ఆ రికార్డులన్నీ నాగార్జునవే)

హీరోగా మహేశ్‌బాబు హిట్, ఫ్లాఫ్స్ ఉండొచ్చు కానీ ఓ మనిషిగా మాత్రం ఇతడిని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఫౌండేషన్ తరఫున ఎంతోమంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లోనే గౌతమ్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహేశ్ ఫౌండేషన్ తరఫున చికిత్స పొందుతున్న పేషెంట్స్ తో గౌతమ్ ముచ్చటించాడు. ఈ పిక్స్‌ని నమ్రత ఇన్ స్టాలో షేర్ చేశారు. 

'చిల్డ్రన్ హాస్పిటల్ కు గౌతమ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇలా వచ్చి సందర్శించాడు. ఎంబీ ఫౌండేషన్, రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్స్ కలిసి ఇలా చిన్నారులకు ఫ్రీగా వైద్యం అందిస్తోంది. గౌతమ్ కూడా ఈ కార్యక్రమంలో ఓ భాగస్వామినే. ఇలా ఆంకాలజీ, కార్డియో వార్డుల్లో పిల్లలతో కలిసి ముచ్చటించాడు. వారి ముఖంలో నవ్వు తీసుకొచ్చాడు. వారికి నయమవుతుందని భరోసా ఇచ్చాడు' అని నమ్రత పోస్టులో పేర్కొంది. కొడుకుని చూసి తెగ గర్వపడుతోంది.

(ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement