
నిమజ్జన వేడుకల్లో సూపర్ స్టార్ కొడుకు
ముంబై తరువాత అదే స్థాయిలో వినాయక చవితి ఉత్సవాలు హైదరబాద్ మహా నగరంలోనే జరుగుతాయి. అందుకే బాలీవుడ్ తారలలానే తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే ఇంట్లో, మండపాల్లో పూజల వరకు ఓకె కానీ నిమజ్జన వేడుకల్లో ఇలాంటి స్టార్లు ఎప్పుడు కనిపించరు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ మాత్రం నిమజ్జనానికి కూడా స్వయంగా వెళ్లాడు.
ఇటీవల ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ ముగించుకొని వచ్చిన మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితిని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం చెన్నై వెళ్లిపోయాడు మహేష్. దీంతో నిమజ్జనం బాధ్యతలు తీసుకున్న గౌతమ్, తానే స్వయంగా దుర్గమ్ చెరువుకు గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశాడు. వినాయక ప్రతిమను గౌతమ్ నిమజ్జనం చేస్తుండగా తీసిన ఫోటో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.