Namrata Shirodkar Shares Emotional Post About Her Son Gowtham, Goes Viral - Sakshi

Namrata Shirodkar: బేబీ.. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటా: నమ్రత ఎమోషనల్ పోస్ట్

Jan 21 2023 2:39 PM | Updated on Jan 21 2023 2:55 PM

Namrata Shirodkar Shares Emotional Post About Her Son Gowtham - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. మిస్‌ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి నటించింది. వంశీ మూవీ సమయంలో మహేశ్‌ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు కుమార్తె సితార గురించి మనందరికీ తెలుసు. నమ్రత శిరోద్కర్ అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా తన కుమారుడు గౌతమ్ గురించి ఆమె తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'గౌతమ్ కల్చరల్ ట్రిప్‌లో భాగంగా మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లాడు. అంతా తన సొంతంగానే చక్కబెట్టుకోవాలి. ఇది తలుచుకుంటే నాలో కొంత భాగం నన్ను విడిచిపెట్టినట్లు అనిపించింది. అతను వెళ్లిన రోజంతా శూన్యంగా ఉంది. గౌతమ్ తిరిగి వచ్చే వరకు ఇదో బాధకరమైన అనుభూతి. మా ఇంట్లో, మా కళ్ల ముందు తిరగాల్సిన చిన్న పిల్లవాడు సొంతంగా బయటికి వెళ్లే స్థాయికి చేరాడు. ఒక వారం వినోదం, ఆనందం, సాహసం అన్నింటికీ మించి నువ్వు ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఈ యాత్ర నీకు విలువైందని ఆశిస్తున్నా. బేబీ.. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పోస్ట్‌లో గౌతమ్ సహ విద్యార్థులతో దిగిన ఫొటోలను నమ్రత పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement